బంధు మిత్రుల సంక్షేమం ఆశించే వారిగా దేవుడి విగ్రహాలను సందర్భానుసారం బహుమతులుగా ఇస్తుంటాం. కానీ ఇది సరైందేనా? అలా ఇవ్వోచ్చా?


దేవుడి విగ్రహాలు రకరకాల సందర్భాల్లో దాదాపు అన్ని సంస్కృతుల్లోనూ బహుమతులుగా ఇస్తుంటారు. దైవ విగ్రహాలు ఆరాధనకు, నమ్మకానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. సన్నిహితుల హితాన్ని ఆశిస్తూ వీటిని బహుకరిస్తుంటాము. తీసుకునే వారు సైతం చాలా ఆనందిస్తారు కూడా. దీనిని జ్యోతిషం, వాస్తు కోణాల్లో చూసినపుడు దేవుడి ప్రతిమలు బహుకరించడం ప్రతిసారీ మంచిది కాకపోవచ్చని పండితులు అంటున్నారు. ఎందుకు మంచిదికాదో కొన్ని కారణాలు తెలుసుకుందాం.


గ్రహప్రభావం


పుట్టుక సమయంలో ఉన్న గ్రహస్థితులను బట్టి మన జాతకం ఆధారపడి ఉంటుంది. ఒకొక్కరి జాతకంలో ఒక్కో దైవం ప్రభావం ఒక్కోవిధంగా ఉంటుంది. మనం బహుకరించే దైవ ప్రతిమ తీసుకునే వారి జాతకానికి సరిపడకపోతే ఇబ్బందులు తలెత్తవచ్చు. వారి ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకాలు కలుగవచ్చుకూడా.


దైవారాధన విధానాలు


సతానతన ధర్మంలో ప్రతిఒక దైవానికి ఒక్కో ప్రత్యేక ఆరాధనా విధానాలు ఉంటాయి. ఈ సంప్రదాయాలు తెలియని వారికి దేవుడి ప్రతిమ ఇచ్చినపుడు ఫలితాలు వ్యతిరేకంగా ఉండే ప్రమాదం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలు వెనుకబడి, నకరాత్మక శక్తులను ఆకర్శించవచ్చు.


దైవ శక్తుల అమరిక


జ్యోతిషంలో ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక శక్తి క్షేత్రం ఉంటుంది. అది వారి జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది. మనం బహుకరించే దైవ ప్రతిమ వారి శక్తి క్షేత్రాల సంతులనాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. వారి శక్తి క్షేత్రాలతో దైవప్రతిమ శక్తి సరిపడేదిగా లేకపోతే వారి జీవితం అస్థిరం అయ్యే ప్రమాదం ఉంటుంది.


భావోద్వేగ అలజడి


దైవ ప్రతిమను అందుకున్న తర్వాత వారి శక్తికి దైవశక్తికి మధ్య అంతరం ఉన్నపుడు భావోద్వేగ అలజడికి కారణం కావచ్చు.


ఆధ్యాత్మిక స్థాయి


వేదాలు ప్రతీ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రత్యేకమైందని చెబుతోంది. బహుమతిగా అందుకున్న దైవ ప్రతిమ ఈ ప్రయాణాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. వారి ఆధ్యాత్మిక దృష్టి మారిపోవచ్చు. ఇది ఒక్కోసారి నిర్మాణాత్మకంగా ఉంటే ఒక్కోసారి అందుకు వ్యతిరేకంగానూ ఉండొచ్చు. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు జీవితంలో చాలా ముఖ్యమైనవని జ్యోతిషం అభిప్రాయం.


నకారత్మక శక్తుల వినియమం


ఒక్కోసారి బహుమతి ఇచ్చిన వారి శక్తి క్షేత్రాలు, తీసుకున్న వారి శక్తి క్షేత్రాల మధ్య తేడాలు ఉంటే దైవ ప్రతిమలు వారి మధ్య నకారాత్మక శక్తుల వినిమయానికి కారణం కావచ్చు. ఇది వారిద్దరి మధ్య బంధావ్యాలను ప్రభావితం చెయ్యవచ్చు.


దైవప్రతిమలు బహుకరించడం వల్ల కర్మ ఫలితాలు తారుమారు కావచ్చు. పుచ్చుకున్న దైవ ప్రతిమ శక్తులు వారి జీవిత మార్గానికి ఆటంకాలు ఏర్పరచవచ్చు. చెడు కర్మలు వారు తెలియకుండా చెయ్యవచ్చు.


ఇలా మంచి పనే అని తెలిసీ తెలియక చేసే పనులు జీవితంలో అలజడికి కారణం కావచ్చు. అందుకే పూర్తి అవగాహన లేకుండా దైవ ప్రతిమలు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. అది ఇచ్చిన వారికి, తీసుకున్న వారికీ వ్యతిరేక ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉందని శాస్త్రం ప్రవచిస్తోంది. 


Also Read : శంఖారావం పూరించేది అందుకే, ఇన్ని లాభాలుంటాయని మీరు అస్సలు ఊహించి ఉండరు