Ramayana: రామాయణంలో రావణుడు ఒక కీలక పాత్ర, తను లేకపోతే ఆ కథ అసంపూర్ణం. అత్యంత జ్ఞాని, వేద పండితుడైన రావణుడిని  పది తలల కారణంగా దశానన్ అని పిలిచేవారు. కానీ రావణుడికి నిజంగా పది తలలు ఉన్నాయా? 

Continues below advertisement

Ramayana: రావణుడిని రావణబ్రహ్మ అని ఎందుకంటారు? అసలు రహస్యం ఇదే!

వాల్మీకి రామాయణం ప్రకారం..

రావణుడికి నిజంగానే 10 భౌతిక తలలు ఉన్నాయని , యుద్ధ సమయంలో లేదా ప్రత్యేక సమయాల్లో వాటిని సృష్టించుకోగల కామరూప విద్య కలిగి ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయ్. ఎందుకంటే రావణుడు శివభక్తుడు, మహాపండితుడు.. నాలుగు లేదాలు, ఆరు శాస్త్రాలు పూర్తిగా అధ్యయనం చేసి వాటిపై పట్టు సాధించాడు. 10 రకాలైన పాండిత్యానికి సంకేతంగా 10 తలలు ఉన్నాయని చెబుతారు. కానీ నిజానికి పదితలలు వ్యక్తిత్వానికి ప్రతీకలు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, చిత్తం, మానస, బుద్ధిని ప్రతిబింబిస్తాయి. రావణుడి వ్యక్తిత్వంలో భాగమైన పూర్తి శక్తి, యుక్తులను పది తలలు ప్రతీకలు అని వివరిస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు  జైన గ్రంథాల ప్రకారం..

Continues below advertisement

రావణుడికి పది తలలు లేవు.  తల్లి కైకసి అతనికి ఇచ్చిన తొమ్మిది పెద్ద, గుండ్రని రత్నాలు అతని మెడలో ఉండేవి. ఈ తొమ్మిది రత్నాల వల్లే  రావణుడు తనకు పది తలలు ఉన్నాయనే భ్రమను సృష్టించాడు.

Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?

మత గ్రంథాల ప్రకారం..

రావణుడిని అనేక శక్తులు, విజయాలు సాధించిన మాంత్రికుడిగా వర్ణిస్తాయి. అతనికి వివిధ రకాల మాయవిద్యలు కూడా తెలుసు. తన శక్తులు , మాయలను ఉపయోగించి, రావణుడు తనకు పది తలలు ఉన్నాయనే భ్రమను సృష్టించాడు. హిందూ పురాణాల ప్రకారం..

రావణుడు శివుని అనుగ్రహంతో పది తలలను పొందాడు. రావణుడు శివుని పరమ భక్తుడు. రావణుని భక్తికి సంతోషించిన శివుడు అతనికి దశానన వరాన్ని ప్రసాదించాడు. అయితే, రావణుని పది తలలు పది దుష్ట శక్తులకు ప్రతీకగా పరిగణిస్తారు రామచరితమానస్ ప్రకారం..

రావణుడి పది శిరస్సుల గురించి కూడా చర్చిస్తుంది రామచరితమానస్. దాని ప్రకారం, కృష్ణ పక్షం (అంధకార పక్షం) అమావాస్య రోజున ప్రారంభమైన యుద్ధంలో, రావణుడి శిరస్సులు ఒక్కొక్కటిగా నరికివేశారు.. చివరకు  శుక్ల పక్షం పదవ రోజున చంపబడ్డాడు. అందువల్ల, రావణుడిని దసరా లేదా విజయదశమి నాడు దహనం చేస్తారు.

Ramayana OTT : ఓటీటీలోకి మైథలాజికల్ ఎపిక్ రామాయణ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

రామాయణంలో..

మత గ్రంథాలలోనూ రావణుడిని తరచుగా ప్రతినాయకుడిగా చిత్రీకరించినప్పటికీ, తనకి సద్గుణాలు కూడా ఉన్నాయి.   గూఢవిద్య, వేదాలు, సంగీతంపై జ్ఞానం ఉండేది. గొప్ప పండితుడు, శివ భక్తుడు , గొప్ప సన్యాసి. అందుకే, తన మరణశయ్యపై శ్రీరాముడు లక్ష్మణుడిని రాజనీతి తెలుసుకోమమని రావణుడి దగ్గరకు పంపించాడు రాముడు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.   

Shiva Tandava Stotram: రావణుడు రచించిన ఈ స్తోత్రమే 'బాహుబలి' సినిమాలో పాట!