Pitru Paksham 2026: సంస్కృత భాషలో పితృ అంటే "పూర్వీకులు", పక్ష అంటే " 15రోజులు" లేదా చాంద్రమాసంలోని ఒక వైపు. పౌర్ణమికి ముందు 15 రోజులు ప్రకాశవంతంగా ఉంటాయి..పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో చంద్రుడు క్షీణించి చీకటిగా మారుతాడు. ప్రకాశవంతమైన పక్షం పెరుగుదలకు సూచన అయితే కృష్ణ పక్షం ఆత్మపరిశీలన, ధ్యానం, శుద్ధీకరణ , పరివర్తనకు సూచన. ఏటా గణేష్ నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే పౌర్ణమి మరుసటి రోజు నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సూర్యుడు ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళానికి మారుతాడు. వేద సంప్రదాయం ప్రకారం దక్షిణ దిశను పితామహులతో సంబంధం ఉన్నదిగా పరిగణిస్తారు. 

Continues below advertisement

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వివాహిత స్త్రీలు పాటించే 4 ముఖ్యమైన ఉపవాసాల తేదీలు ఇవే!

2026లో పితృపక్షాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 10 వరకు...ఈ రెండు వారాలు పెద్దలను పూజించేందుకు అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. సంయమనం పాటించాల్సి సమయంగా..మాంసం, మద్యం, మత్తు పదార్థాలు, అధిక తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. పితృదేవతలకు నైవేద్యంగా సమర్పించే ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉపయోగించకూడదు. గరుడ పురాణం ప్రకారం, పితృ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడవడం, పిండ ప్రదానం చేయడం ఆ కుటుంబానికి మంచి చేస్తుందని, దోషాలు తొలగిస్తుందని నమ్మకం. అయితే ఈ సమయంలో చేయకూడని కొన్ని పనులున్నాయి. అవేంటో తెలుసుకుందాం

పెద్దలను గౌరవించండి

Continues below advertisement

పితృదేవతలకు చేసే కర్మకాండలను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయడం పితృదోషాన్ని ఆహ్వానించడంతో సమానం. పితృ పక్షం కేవలం దివంగత పూర్వీకులను స్మరించుకునే సమయం మాత్రమే కాదు, కుటుంబ పూర్వీకుల సంప్రదాయాలను గౌరవించే అవకాశం కూడా. అందువల్ల, జీవించి ఉన్న తల్లిదండ్రులను, పెద్దలను అవమానించడం లేదా కఠినమైన మాటలతో లేదా చేతలతో వారిని బాధపెట్టడం చేయవద్దు. అటువంటి అగౌరవం పితృ దోషానికి సంకేతంగా పరిగణిస్తారు. పవిత్రతకు ప్రాధాన్యం

పితృ పక్షంలో, పూజకే కాకుండా ప్రవర్తనా పవిత్రతకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. మోసం, హింస, దూషణలు లేదా అనైతిక కార్యకలాపాలలో పాల్గొనడం వంటివి పితృదేవతలకు కోపం తెప్పిస్తాయి, అందువల్ల శ్రాద్ధ కర్మలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు.

Dussehra 2026: నవరాత్రిలో అద్దెకు 'గర్బా భాగస్వామి'! ప్యాకేజీలు, నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు!

మూగజీవాలను హింసించవద్దు

పితృదేవతలు పక్షులు,  జంతువులలో నివసిస్తారని నమ్ముతారు, కాబట్టి కాకులు, ఆవులు లేదా కుక్కలను తరుమడం లేదా వేధించడం వంటివి చేయకూడదు. పితృ పక్షంలో శ్రాద్ధ కర్మలు చేసేవారు ఆ 15 రోజుల పాటు జుట్టు లేదా గోళ్లను కత్తిరించుకోకూడదు. అంతేకాకుండా పితృ కర్మలు ఆచరించేవారు బ్రహ్మచర్యం కూడా పాటించాలి.

పితృదేవతల ఆగ్రహానికి గురికావొద్దు పితృదేవతలు ఆగ్రహించినట్టైతే  కుటుంబంలో శుభకార్యాలకు ఆటంకం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. వంశ వృద్ధి ఉండదు. కుటుంబ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. కుటుంబంలోని ఏడు తరాలు ఆర్థిక, మానసిక పరిణామాలతో బాధపడతారని నమ్ముతారు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.