Wolf Moon Paush Purnima 2026:  ఆకాశంలో అద్భుతమైన ఖగోళ సంఘటనలు కనిపిస్తాయి, అందులో పౌర్ణమి రోజు కూడా ఒకటి. ప్రతి నెలా పౌర్ణమి రోజున ఆకాశంలో చంద్రుని అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అయితే, ఈ సంవత్సరం మొదటి పౌర్ణమి అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతోంది.

Continues below advertisement

శనివారం, జనవరి 3, 2026 న ఈ సంవత్సరం మొదటి పౌర్ణమి వస్తోంది, దీనిని వోల్ఫ్ మూన్  (Wolf Moon 2026) అని పిలుస్తున్నారు. ఈ రోజున మీరు ఆకాశంలో చాలా అందమైన దృశ్యాన్ని చూస్తారు. రాత్రిపూట చంద్రుని కాంతి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం.

భారతదేశంలో వోల్ఫ్ మూన్  ఎప్పుడు కనిపిస్తుంది (January 2026  Wolf Moon Time in India)

Continues below advertisement

పౌష పౌర్ణమి నాడు వుల్ఫ్ మూన్ అనే ముఖ్యమైన ఖగోళ సంఘటన జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం, జనవరి 3, 2026 న రాత్రి సుమారు 10 గంటల 45 నిమిషాలకు భూమి తన కక్ష్యలో సూర్యునికి అత్యంత సమీప బిందువు వద్ద ఉంటుంది. ఈ పరిస్థితిని ఉపసౌరం (Perihelion) అని కూడా అంటారు. ఈ సమయంలో భూమికి, సూర్యునికి మధ్య దూరం సుమారు 14 కోట్ల 70 లక్షల 99 వేల 894 కిలోమీటర్లు ఉంటుంది. ఉపసౌరం (Perihelion) సమయంలో భూమి తన కక్ష్యలో అత్యంత వేగంగా (సుమారు 30.27 కి.మీ.) తిరుగుతుంది.

వోల్ఫ్ మూన్ అని ఎందుకు అంటారు (Wolf Moon History)

సంవత్సరంలోని 12 పౌర్ణమిలకు వేర్వేరు పేర్లు ఉన్నాయి. జనవరి నెల పౌర్ణమిని వుల్ఫ్ మూన్ అంటారు, ఇది ఈ సంవత్సరం మొదటి పౌర్ణమి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ నెల పౌర్ణమికి వుల్ఫ్ మూన్ అని పేరు రావడానికి చారిత్రక కారణం ఏంటంటే, పురాతన కాలంలో జనవరి నెలలో విపరీతమైన చలి ఉండేది మరియు ఉత్తరార్ధగోళంలో తోడేళ్ళ గుంపుల అరుపులు వినిపించేవి. అందుకే ఈ పౌర్ణమికి తోడేలు (వుల్ఫ్) పేరు పెట్టారు.

మతపరమైన దృష్టితో కూడా జనవరి పౌర్ణమి ప్రత్యేకం

హిందూ మతంలో పౌర్ణమి తిథిని మతపరమైన దృష్టితో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. సాధారణంగా జనవరి నెలలో పౌష లేదా మాఘ మాసం ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం 2026 లో జనవరి 3 న పౌష లేదా పూస్ పౌర్ణమి వచ్చింది. ఈ తిథి నాడు  స్నానం, దానం, వ్రతం, పూజ వంటి మతపరమైన పనులు చేస్తారు. ఏటా పుష్య పౌర్ణమి నుంచి మాఘమేళా (Magh Mela 2026)  మొదటి స్నానం కూడా చేస్తారు. 

వోల్ఫ్ మూన్ అంతర్ దృష్టి , భావోద్వేగ అవగాహనను పెంచుతుందని పండితులు చెబుతారు . మార్పును స్వీకరించడానికి ఇదే మంచి సమయం అని సూచిస్తుందట ఈ పౌర్ణమి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

పుష్య పూర్ణిమ రోజు చంద్ర గ్రహణం ఉందా? 2026లో మొదటి చంద్ర గ్రహణం ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి