Work Tips in Telugu: కేవలం పని చేయడం మాత్రమే సరిపోదు.. సరైన పద్ధతిలో పని చేయడం కూడా చాలా అవసరం. కొందరు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు, మరికొందరు వాటిని స్వయంగా సృష్టించుకుంటారు. మీరు మీ కెరీర్, ఉద్యోగం లేదా వ్యాపారంలో వేగంగా పురోగతి సాధించాలనుకుంటే, మీరు కేవలం చూస్తూ ఉండిపోయేవారిలా కాకుండా, 'పనులను జరిగించేవారి' కోవలో ఉండాలి. మీ కార్యాలయంలో మీ పనితీరును , ఎదుగుదలను మార్చగల 5 శక్తివంతమైన చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకోండి
సరైన దిశలో పని చేయండి
పని చేసే చోట మీరు కూర్చునే దిశ మీ పనిని ప్రభావితం చేస్తుంది. తూర్పు: పనికి ఉత్తమమైన దిశగా పరిగణిస్తారు. ఇది కీర్తి, గౌరవం ,అభివృద్ధిని తెస్తుంది.పశ్చిమం: సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి మంచిది.ఉత్తరం: నేర్చుకోవడానికి, శిక్షణకు , జ్ఞానానికి ఉత్తమమైనది.దక్షిణం: ఇంటర్వ్యూలు , సమావేశాలకు ప్రయోజనకరమైనది.
వీలైతే, మీ డెస్క్ స్థానాన్ని మార్చుకుని, సరైన దిశలో కూర్చోవడం ప్రారంభించండి.
మీ డెస్క్ , పని ప్రదేశాన్ని క్రమబద్ధంగా ఉంచుకోండి
మీ డెస్క్ కేవలం పని చేసే ప్రదేశం మాత్రమే కాదు, అది ఉత్పాదకతకు కేంద్రం. కుడి వైపు – మొక్కలు, ఫోటోలు, సృజనాత్మక విషయాలుఎడమ వైపు – ఫైళ్లు, డైరీ, ఫోన్, స్టేషనరీదానికి కారణం ఏంటంటే మెదడు కుడి భాగం సృజనాత్మకంగాను, ఎడమ భాగం తార్కికంగాను ఉంటుంది.
ఏం చేయాలి?
చిన్న ఆకుపచ్చ మొక్కలను ఉంచండి.కుటుంబ ఫోటోలు లేదా సానుకూల విషయాలను ఉంచుకోండి. మీ అదృష్ట రంగును ఉపయోగించండి. సౌకర్యవంతమైన , శబ్దం చేయని కుర్చీని ఉపయోగించండి.పని చేసే చోట ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ చాలా గొప్ప వ్యక్తులు దీన్ని చేస్తారు.శబ్దం చేసే కుర్చీ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది, అంతేకాకుండా ఆరోగ్య సమస్యలకు ఏకాగ్రత లోపానికి దారితీయవచ్చు.
ఆఫీసులో ఎలాంటి కుర్చీలో కూర్చోవాలి?
ఆఫీసులో ఎర్గోనామిక్ కుర్చీని ఎంచుకోండి. వెన్నుకు మంచి ఆధారం ఉండాలి.పని చేస్తున్నప్పుడు మీ శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోండి.
ఆఫీసులో రోజును ఎలా ప్రారంభించాలి?
పనిలో మీ రోజును సానుకూల దృక్పథంతో ప్రారంభించండి. మీకు ఉదయం బాగోలేకపోతే, ఆ రోజంతా కూడా బాగోలేకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల, కార్యాలయంలో పని ప్రారంభించే ముందు, ఉదయం పూట సూర్యరశ్మిని పొందండి, 2-3 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి, సమావేశానికి లేదా కాల్‌కు ముందు లోతైన శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి.
ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఆందోళన తగ్గుతుంది.ఆత్మవిశ్వాసం పెరిగుతుందిసంభాషణ మెరుగుపడుతుంది. దృశ్యీకరణ ,సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండికేవలం కష్టపడటం మాత్రమే సరిపోదు, మనస్తత్వం కూడా అంతే ముఖ్యం.
ఎలా చేయాలి?
కాల్ చేసే ముందు ఆలోచించండి, అప్పుడు సంభాషణ విజయవంతమవుతుంది.ఇమెయిల్ పంపే ముందు 3 సెకన్ల పాటు ఏం పంపించాలో చెక్ చేసుకోండిసమావేశానికి ముందే ఒక సానుకూల ఫలితాన్ని ఊహించుకోండి. కార్యాలయంలో టీమ్ తో సమావేశం నిర్వహించే ముందు.. అనుకూల, ప్రతికూల ఫలితాలపై మీరు స్పష్టంగా ఉండండిసమావేశం అంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఓ అడుగులా ఉండాలి.. బృంద సభ్యులు మరింత నిరాశలో కూరుకుపోయేలా ఉండకూడదుఅనుకూల విషయాలపై ప్రోత్సహిస్తూనే ప్రతికూలతను వదిలించుకునేందుకు ఏం చేయాలో స్పష్టంగా చెప్పేలా సిద్ధమవండిఇవన్నీ వినడానికి చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
పనిచేసే చోట మీ వైఖరిని సానుకూలంగా ఉంచుకోండి
పని ప్రదేశంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలు ఇవే: అహం, ఇతరులతో పోల్చుకోవడం, ఆఫీసు రాజకీయాలు.అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి?మీ ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంచుకోండి. సహాయకరంగా ఉండండి.జట్టు సభ్యునిగా వ్యవహరించండి. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. నైపుణ్యాలు ఉద్యోగం ఇప్పిస్తాయన్నది అక్షరాలా నిజం, కానీ మీ వైఖరి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీరు మీ కెరీర్‌లో నిజంగా ముందుకు సాగాలనుకుంటే, కేవలం కష్టపడటమే కాకుండా, తెలివిగా కూడా పని చేయండి.
సరైన దిశ, సరైన వాతావరణం, సరైన మనస్తత్వం , సరైన వైఖరి..మంచి ఆలోచన ఇవన్నీ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి
