Mahabharat Numerology: మహాభారతం జీవితాన్ని, కర్మను, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే అద్దం. మీ జన్మ సంఖ్య ఏ మహాభారత పాత్రతో ముడిపడి ఉందో, దాని నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోండి.
సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 నుంచి 9 ఏ నంబర్ వ్యక్తులు మహాభారతంలో ఏ పాత్రతో సరిపోతారు?
నంబర్ 1
ఏ నెలలో అయినా 1,10,28 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 అవుతుంది. ఈ నంబర్ కి అధిదేవత సూర్యుడు. మహాభారతంలో కర్ణుడి పాత్రతో సరిపోతారు. అందుకే కర్ణుడుని సూర్యపుత్రుడు అంటారు
నంబర్ 2
ఏ నెలలో అయినా 2,11,29 తేదీల్లో జన్మించిన వారి నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 2. వీరికి చంద్రుడు అధిపతి. ఇది భావోద్వేగాలు, అనుభూతులను సూచిస్తుంది. మహాభారతంలోని పాత్ర గంగాపుత్ర భీష్మ పితామహునితో సరిపోతుంది.
నంబర్ 3 ఏ నెలలో అయినా 3,12, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 3 అవుతుంది. ఇది గురువుతో పాలించే నంబర్. జ్ఞానం , తెలివికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ సంఖ్య కలిగిన వ్యక్తులు మహాభారతంలోని గురువు ద్రోణాచార్యుల జన్మ సంఖ్యతో సరిపోలుతారు. పాండవులు , కౌరవులకు గురువు ద్రోణాచార్యులు
నంబర్ 4
ఏ నెలలో అయినా 4,13, 22, 31 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 అవుతుంది. వీరికి రాహువు అధిపతి. రాహువును చీకటి భ్రమకు చిహ్నంగా భావిస్తారు. మహాభారతంలోని దుర్యోధనుడి పాత్రతో వీరికి సంబంధం ఉంటుంది. దుర్యోధనుడు మహాభారత యుద్ధానికి నాయకత్వం వహించాడు.
నంబర్ 5
ఏ నెలలో అయినా 5,14, 23 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 5 అవుతుంది. వీరికి బుధుడు అధిపతి. ఇది హాస్యం, జ్ఞానం, బుద్ధి , పరిపక్వతకు చిహ్నం. ఈ వ్యక్తుల జన్మ సంఖ్య భగవాన్ కృష్ణుడితో సరిపోలుతుంది.
నంబర్ 6
ఏ నెలలో అయినా 6,15, 24 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 అవుతుంది. వీరికి శుక్రుడు పాలకుడు. ఇది స్త్రీ శక్తికి చిహ్నం. ఈ సంఖ్య కలిగిన వారు అందంగా , శక్తివంతంగా కూడా ఉంటారు. మహాభారతంలోని ద్రౌపది పాత్ర ఈ సంఖ్యతో సరిపోతుంది.
నంబర్ 7
ఏ నెలలో అయినా 7,16, 25 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యకు అధిపతి కేతువు. వీరు ధార్మికత , ఆధ్యాత్మికతకు చిహ్నంగా చెబుతారు. ఈ నంబర్ మహాభారంతో ధర్మరాజుకి సరిపోతుంది నంబర్ 8
ఏ నెలలో అయినా 8,17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 8 అవుతుంది. ఈ సంఖ్యను శని గ్రహం పాలిస్తుంది. ఇది క్రమశిక్షణ, న్యాయం కర్మ ప్రధాన దేవత. మహాభారతంలోని విదురుడు పాత్ర ఈ సంఖ్యతో సరిపోలుతుంది.
నంబర్ 9 ఏ నెలలో అయినా 9,18,27 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 అవుతుంది. ఈ సంఖ్యకి అధిపతి కుజుడు, ఇది బలం, శక్తి ధైర్యానికి చిహ్నం. మహాభారతంలోని భీముడు పాత్ర ఈ సంఖ్యతో సరిపోతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.