Nepal Flash Floods: నేపాల్-టిబెట్ సరిహద్దు దగ్గర ఓ మంచు కొండ విరిగిపడింది. హిమనీనది కూలిపోవడంతో మట్టి, రాళ్లు, మంచు, నీరు కలపి సునామీలా దూసుకొచ్చాయ్. భోటేకోషి, త్రిశూలి నదులు అకస్మాత్తుగా ఉగ్రరూపం దాల్చి గ్రామాలను, పట్టనాలను, వంతెనలను, హైడ్రోపవర్ ప్రాజెక్టులను ముంచెత్తాయ్. వందలమంది ప్రాణాలు కోల్పోయారు, వేలమంది ఆచూకీ ఇంకా దొరకలేదు. కొన్ని శవాలు భారత్ నదుల్లోనూ కనిపించాయ్. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు..ప్రకృతి మనకిచ్చిన హెచ్చరిక.

Continues below advertisement

హిమాలయాలు కేవలం మంచు కొండలు మాత్రమేకాదు..అవి పరమేశ్వరుడి జటాజూటం నుంచి జన్మించిన పవిత్ర ప్రదేశం.గంగానది అవతరించింది ఇక్కడేఎందరో మహర్షులు తపస్సు ఆచరించింది ఇక్కడేఈ పవిత్రప్రదేశంలో దేవతలు విహరిస్తారని పురాలు చెబుతున్నాయ్

ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇప్పుడేం జరిగింది?హిమనది విరిగిపడింది, మట్టి రాళ్లు నీరు కలసి ఉగ్రరూపం దాల్చి గ్రామాలను గ్రామాలను తుడిచిపెట్టేశాయ్, ఎన్నో ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయి. వేలమంది జాడ కనిపించడం లేదు. సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయ్. కొన్ని శవాలు భారతదేశంలో నదుల్లోనూ కనిపించాయ్. 

Continues below advertisement

September 2026 Weather: సెప్టెంబర్‌లో భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది!

ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా? ప్రకృతి ఇచ్చిన గంభీరమైన హెచ్చరికా? సనాతనధర్మం ప్రకృతిని ఎప్పుడూ తల్లిగా భావించింది. అందుకే భూమాత, వనదేవత, నదీమతల్లి, వాయుదేవుడు, అగ్ని దేవుడు, వానదేవుడు అంటూ అన్నింటినీ దైవస్వరూపంగా పూజిస్తారు. 

“మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః” 

భూమి నా తల్లి...నను ఆమె కొడుకుని అని అర్థం

తల్లిలాంటి భూమిని ఇప్పుడెలా చూస్తున్నాం?అడవలు నరికేస్తున్నాంహిమనదులు వేడెక్కించేలా వాతావరణాన్ని కలుషియం చేస్తున్నాంనదులను మురుగు కాలువలుగా మారుస్తున్నాంకొండల్లో అనవసర నిర్మాణాలు చేసి గాయపరుస్తున్నాం

Nepal Flood 2026: నేపాల్ వరద 2026 , సెప్టెంబరులో హిమాలయ నదులకు ముప్పు? జ్యోతిష్య అంచనాలతో ఆందోళన!

ప్రకృతి సహనం అనంతమే కానీ ఓర్పు దాటితే ఆ కోపం ఇలా వ్యక్తమవుతుందంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు..పురాణాల్లో ఇలాంటి హెచ్చరికలు ఎన్నో ఉన్నాయ్.

రాజులు, ప్రజలు ధర్మం మరిచి ప్రకృతిని అవమానించినప్పుడు వర్షాలు కురవలేదునదులు ఎండిపోయాయ్భూకంపాలు వచ్చాయ్ఇప్పుడు జరుగుతున్నది అదే..

హిమాలయాల్లో హిమనదులు కరుగుతున్నాయ్గ్లేసియల్‌ లేక్స్ ఉబ్బి పగిలిపోతున్నాయ్ఇది కేవలం సైన్స్ కాదు..ధర్మం దారితప్పుతోందని ప్రకృతి ఇస్తోన్న హెచ్చరిక

భారత్ కు ఈ ముప్పు ఎంత దగ్గరగా ఉందో గమనించాలినేపాల్ నదులు...గంగా, యమునా, బ్రహ్మపుత్రలో కలుస్తాయి..ఓ వైపు హిమాలయాలు ధ్వంసమైతే మరోవైపు ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రజలు కూడా అదే బాధ అనుభవించాల్సి వస్తుంది. 

గంగమ్మను ఇప్పటికీ పూజిస్తున్నాం కానీ అందులో మురుగు కలుపుతున్నాం..కాశీలో, హరిద్వార్ లో పుణ్యస్నానాలు ఆచరిస్తూనే కలుషితం చేస్తున్నాం.  

ప్రకృతిని గౌరవించడం అంటే దైవాన్ని గౌరవించడమే. తులసి మొక్కను పూజిస్తున్నట్టే..ప్రతి చెట్టు, ప్రతి నది, ప్రతి కొండను గౌరవించాలి.   

“వృక్షో రక్షతి రక్షితః” 

చెట్టును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుకే ప్రకృతిపట్ల భక్తి ఉండాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి, నదులను శుద్ధి చేయాలి, అనవర నిర్మాణాలు ఆపాలి, వాతావరణంలో మార్పులు తగ్గించేలా జీవనశైలి మార్చుకోవాలి. ఇవి కేవలం పర్యావరణ కర్తవ్యాలు కాదు ధర్మ కర్తవ్యాలు. 

నేపాల్ ప్రజల బాధను మనం మన బాధగా భావించాలివారికి సహాయం చేయాలి..అదే సమయంలో మనం మేల్కోవాలి..ప్రకృతిని గౌరవించాలి