Srisailam Shardiya Navratri 2025: శ్రీశైలంలో శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబిక నవదుర్గల అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఉత్సవాల్లో మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంట, నాలుగో రోజు కూష్మాండ, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, ఏడో రోజు కాళరాత్రి, ఎనిమిదో రోజు మహాగౌరిగా దర్శనమిచ్చిన భ్రమరాంబిక సెప్టెంబర్ 30 తొమ్మిదో రోజు సిద్ధిధాత్రిగా అభయం ఇస్తోంది.
నవదుర్గల్లో తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి. సిద్ధి అంటే ఓ పని పూర్తవడం..ధాత్రి అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని పూర్తిచేసే అమ్మ అని అర్థం. ఇహలోక సుఖాలను మాత్రమే కాదు..జ్ఞానాన్ని,మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది సిద్ధిధాత్రి. కుండలినిలో అన్ని ద్వారాలనూ దాటుకుని సాధించే మోక్షాన్ని మించినది ఏముంటుంది. అందుకు సూచనగా భ్రమరాంబిక సిద్ధిధాత్రిగా వికసించిన కమలంపై ఆశీనురాలై ఉంటుంది. సిద్ధిధాత్రి దుర్గకు నాలుగు చేతులుంటాయి. నాలుగు చేతుల్లో కమలం, గద, సుదర్శన చక్రం, శంఖం ఉంటాయి. ఈ దుర్గను ఆరాధించే భక్తులకు బ్రహ్మజ్ఞానం లభిస్తుందని పురాణాల్లో ఉంది. సిద్ధిధాత్రిని కేవలం మానవులే కాదు.. దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు కూడా పూజిస్తారు. సిద్ధిధాత్రిని ఉపాసించేవారికి ఎంతటికార్యం అయినా నెరవేరుతుంది. ఈ రోజు బాలలకు పూజ చేయడం వల్ల సకల కార్యాల్లో విజయం సాధిస్తారు, కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
సిద్ధి ధాత్రి కేతువుకి అధిపతిజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు.. క్రమశిక్షణ, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి ప్రేరణ ఇస్తాడు. ఈ దేవతను పూజించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం, స్వీయ అన్వేషణ వృద్ధి చెందుతుంది సిద్దిధాత్రి మంత్రంఐం హ్రీం క్లీం చాముండాయై విచేసిద్ధగందర్వ యాక్షాద్వై్ర్సురైర్మరైర్పిసేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ
సిద్దిధాత్రి ధ్యాన శ్లోకం సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥
నవ దుర్గా స్తోత్రం
గణేశఃహరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥
దేవీ శైలపుత్రీవందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥
దేవీ బ్రహ్మచారిణీదధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
దేవీ చంద్రఘంటేతిపిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥
దేవీ కూష్మాండాసురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥
దేవీస్కందమాతాసింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥
దేవీకాత్యాయణీచంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥
దేవీకాలరాత్రిఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥
దేవీమహాగౌరీశ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥
దేవీసిద్ధిదాత్రిసిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥
శ్రీ మాత్రే నమః
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
దసరా 2025: విజయదశమి ఎప్పుడు? ఆయుధ పూజ శుభ సమయం, రావణ దహనం ముహూర్తం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి