Holi 2026: కాశీలో మాసాన్ హోలీపై వివాదం ! ఈ ఘాట్ వద్ద హోలీ జరుపుకోవడం సనాతన ధర్మాన్ని అపహాస్యం చేయడమేనా?
Holi in Kashi 2026:కాశీలో 'మసాన్ కీ హోలీ' పై వివాదం రాజుకుంటోంది! ఇది సామాజిక వక్రీకరణలను వ్యాపింపజేస్తుందని కొందరు పండితులు అభ్యంతరం చెబుతున్నారు. ఇంతకీ మసాన్ కి హోలీ అంటే ఏంటి?

2026 Masan Holi in Kashi: కాశీలోని వారణాసిలోని మణికర్ణికా ఘాట్ వద్ద మాసాన్ హోలీ వేడుకలు నిర్వహించడంపై కాశీ విద్వత్ పరిషత్ ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాండే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సనాతన సంప్రదాయాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచానికే ప్రత్యేకమైన మతపరమైన కాశీ నగరంలో ఎన్నో పండుగలు వైభవంగా జరుపుకుంటారు, అలాంటి ఓ కార్యక్రమం మాసాన్ హోలీ, దీనిలో హోలీకి ముందు, వారణాసిలోని మహాశంషాన్ ఘాట్ వద్ద మండుతున్న చితుల మధ్య బూడిదతో భారీ సంఖ్యలో ప్రజలు హోలీ ఆడతారు. గతేడాది ఈ వేడుక చుట్టూ వివాదం చెలరేగింది..ఈ ఏడాది కూడా కాశీ విద్వత్ పరిషత్ మాసన్ హోలీ వేడుకలపై అభ్యంతరం వ్యక్తం చేసింది, ఇది సనాతన ధర్మాన్ని కించపరిచే చర్య అని స్పష్టంగా పేర్కొంది.
ఇది సమాజంలో చెడును వ్యాపింపజేస్తుంది - కాశీ విద్వత్ పరిషత్ ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాండే
మాసాన్‌లో హోలీ వేడుకల గురించి కాశీ విద్వత్ పరిషత్‌కు చెందిన ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాండేతో ABP తో మాట్లాడినప్పుడు, అలాంటి సంఘటన గురించి గ్రంథాలలో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు. మణికర్ణికా ఘాట్ , హరిశ్చంద్ర ఘాట్ శోక స్థలాలు. మోక్షాన్ని కోరుతూ మరణించిన వ్యక్తి చివరి ప్రయాణానికి ఈ ప్రదేశం కచ్చితంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, కానీ అలాంటి ఏదైనా సంఘటన హానికరం. సహజంగానే, అక్కడ కూర్చున్న ఏ కుటుంబ సభ్యుడైనా దుఃఖంలో లేదా బాధలో ఉంటారు .. అదే స్థలంలో సంప్రదాయం పేరుతో అలాంటి నృత్యం లేదా కార్యక్రమాన్ని నిర్వహించడం సనాతన ధర్మాన్ని కళంకం చేయడంతో సమానం. ఇది సమాజంలో వక్రీకరణను వ్యాపింపజేస్తుందని గతంలో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
హోలీకి ముందు, వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్ మరియు మణికర్ణిక ఘాట్ వద్ద లక్షలాది మంది ప్రజలు మాసాన్ హోలీ ఆడటానికి గుమిగూడారు. గత కొన్ని సంవత్సరాలుగా, జనసమూహం మరింత పెరుగుతోంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి యువకులు హాజరవుతారు, దీనికి సంబంధించి వివిధ మత నాయకులు కూడా గృహస్థులు అలాంటి కార్యక్రమాలకు హాజరు కాకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
మార్చి 1 కామదహనం - మార్చి 2 హోలీ
ఏటా ఫాల్గుణ మాసంలో హోలీ పండుగ వస్తుంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కుమారుడైన ప్రహ్లాదుడు.. విష్ణువు భక్తుడు కావడాన్ని భరించలేక చంపించాలని అనుకుంటాడు. తన సోదరి హోలికకు తనయుడిని అప్పగించి మంటల్లో దహనం చేయాలని ఆదేశిస్తాడు. కానీ ఆ మంటల్లో హోలిక మాడి మసైపోతుంది. అందుకు సూచనగా హోలీ రోజు మంటలు వెలిగిస్తారు. తమ జీవితంలో చెడు దహనం కావాలని కోరుకుంటారు. శివపార్వతులను ఒక్కటి చేసేందుకు ప్రయత్నించి మన్మథుడు భస్మం అయిన సందర్భంగా హోలీ జరుపుకుంటారని మరో కథనం
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!
2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!
























