Margashira Masam 2025: నవంబర్ 21 న ప్రారంభమైన మార్గశిరమాసం డిసెంబర్ 19 అమావాస్యతో ముగుస్తుంది. తెలుగునెలల్లో విలక్షణమైన మాసం అని పిలిచే మార్గశిరంలో గురువారాలు అత్యంత ప్రత్యేకం. ఈ నెలలో వచ్చే గురువారాలు శ్రీ మహాలక్ష్మిని పూజించి.. పుష్యమాసం ప్రారంభంలో వచ్చే గురువారంతో పూజ పూర్తిచేయాలి. మార్గశిర గురువారం వ్రతాన్ని ఆచరించే వివాహితులకు సౌభాగ్యం, పుట్టింటి ఆదరణ దక్కుతుందని పురాణాల్లో ఉంది.  అప్పుల బాధలు తొలగిపోయి సిరిసంపదలు కలుగించే ఈ వ్రతం గురించి పరాశర మహర్షి స్వయంగా నారదమహర్షికి వివరించారు

Continues below advertisement

2025లో మార్గశిర గురువారాలు ఎప్పుడొచ్చాయి - ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సిద్ధం చేయాలి

నవంబర్ 27 మార్గశిర మాసం మొదటి గురువారం - ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి పులగం నైవేద్యంగా సమర్పిస్తారు

Continues below advertisement

డిసెంబర్ 04 మార్గశిర మాసం రెండో గురువారం - ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి అట్లు-తిమ్మనం నైవేద్యం పెట్టాలి

డిసెంబరు 11 మార్గశిరమాసం మూడో గురువారం - ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి అప్పాలు, పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి

డిసెంబరు 18 మార్గశిర మాసం నాలుగో గురువారం- ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి పులిహోర, గారెలు నైవేద్యం పెట్టాలి

నాలుగు గురువారాలు శ్రీ మహాలక్ష్మిని పూజించి..ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులకు భోజనం, తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. 

మార్గశిర గురువారం పూజా విధానం 

మార్గశిర గురువారం పూజ చేయాలి అనుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి..శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ ముగ్గు వేయాలి. తలకు స్నానం చేసి దేవుడి మందిరాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడసోపచార పూజ చేయాలి. పూర్తి విధివిధానాలతో పూజ చేసే అవకాశం లేనివారు...భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి...శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, కనకధారా స్తోత్రం చదువుకోవాలిట శ్రీ మహాలక్ష్మి గాయత్రి

ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్‌”

పూజ పూర్తైన తర్వాత నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మివారం  వ్రత కథ చెప్పుకుని ఆ అక్షతలు అమ్మవారి దగ్గర కొన్నివేసి మిగిలినవి తలపై వేసుకోవాలి (మార్గశిర గురువారం వ్రత కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

సాధారణంగా ఏ పూజ చేసినా చివర్లో ఉద్వాసన చెబుతారు..కానీ మార్గశిర గురువారం పూజలో అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. ఉద్వాసన అంటే వెళ్లి రమ్మని అర్థం..అమ్మవారిని వెళ్లమని ఎలా అంటాం...శ్రీ మహాలక్ష్మి స్థిరంగా ఇంట్లో కూర్చోవాలని ఆశపడతాం. అందుకే అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. అయినప్పటికీ కొందరు ఉద్వాసన చెబుతుంటారు...అది వారి నమ్మకం. మార్గశిర గురువారం వ్రతం చేసేవారు ఈ నియమాలు పాటించాలి మార్గశిరమాసంలో నోము నోచే స్త్రీలు గురువారాల్లో తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కులు తీసుకోవడం చేయకూడదు. సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి..సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు.. భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించాలి డిసెంబర్ 19 అమావాస్యతో మార్గశిరమాసం పూర్తై...డిసెంబర్ 20 నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!