Amavasya 2025: హిందూ ధర్మంలో అమావాస్య రోజున చంద్రుడిని పూజించే ఆచారం ఉంది. ఈ రోజున భక్తితో చంద్రుడిని పూజిస్తే, కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజు వేకువజామునే స్నానం ఆచరించి.. పితృదేవతలను పూజించి వారికి తర్పణం సమర్పించి, దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీర్వచనం లభిస్తుందని పండితులు చెబుతారు. అందుకే దర్శ అమావాస్యను శ్రాద్ధ అమావాస్య అని పిలుస్తారు
అమావాస్య 2025 ఎప్పుడు?
మార్గశిర మాసం అమావాస్య 2025 డిసెంబర్ 19 న వచ్చింది. అమావాస్య తిథి వేకువజామున ప్రారంభమై రోజంతా ఉంటుంది. ఎలాంటి గందరగోళం లేకుండా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయానికి అమావాస్య తిథి ఉంది. అందుకే డిసెంబర్ 19న అమావాస్య.. ముహూర్తం సమయంబ్రహ్మ ముహూర్తం ఉదయం 04:33 నుంచి ఉదయం 05:25 వరకువిజయ ముహూర్తం మధ్యాహ్నం 01:32 నుంచి మధ్యాహ్నం 02:15 వరకుగోధూళి ముహూర్తం సాయంత్రం 05:09 నుంచి సాయంత్రం 05:35 వరకుఅమృతకాలం డిసెంబర్ 19 శుక్రవారం మధ్యాహ్నం 01:09 నుంచి 02:56 వరకు సూర్యోదయం ఉదయం 6 గంటల 26 నిముషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 25 నిముషాలు
అమావాస్య ప్రాముఖ్యత
నమ్మకాల ప్రకారం.. అమావాస్య రోజున ఉపవాసం చేసే వారిపై శివుడితో పాటు చంద్రుని అనుగ్రహం కూడా ఉంటుంది. చంద్రుడు శాంతిని అందిస్తాడు. అమావాస్య రోజున పితృదోషం నుంచి విముక్తి పొందడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
అమావాస్య పూజా విధానం
అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి.వ్రతం చేయడానికి సంకల్పం తీసుకుని పూజ పూర్తిచేయండిశివుడు, పార్వతి దేవి, చంద్రుడు, తులసిని పూజించండి
పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి. తరువాత దీపం వెలిగించి పూజ ప్రారంభించండి. శివుడు, పార్వతి దేవి విగ్రహాలను ప్రతిష్టించిన తర్వాత అభిషేకం చేయండి. అలాగే, చంద్రుడిని ఆహ్వానించండి. శివలింగంపై పాలు, పండ్లు, పువ్వులు, గంజాయి-దతురాతో పంచామృతం సమర్పించండి. శివుడు , పార్వతి దేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. అనంతరం చంద్రుడిని స్తుతించండి. దర్శ అమావాస్య వ్రత కథను విని శివ చాలీసా పఠించండి. అనంతరం తులసి ముందు దీపం వెలిగించి పూజ పూర్తిచేసి ఫలహారం తీసుకోండి. మర్నాడు ఉదయం పూజ తర్వాత వ్రతాన్ని విరమించండి అమావాస్య రోజు ఏం చేయాలి?
అమావాస్య రోజున బ్రహ్మచర్యం నియమాలను కచ్చితంగా పాటించండి.పితృదేవతల పేరు మీద తర్పణం ఇవ్వండిసాత్విక ఆహారం తీసుకోండి. అందరినీ గౌరవించండి. దానధర్మాలు చేయండి
“మాసానాం మార్గశీర్షోఽహం” అని చెప్పాడు.అంటే “మాసాలలో నేను మార్గశిర్ష మాసం”
అందుకే ఈ నెల మొత్తం చాలా పవిత్రమైనదే.. అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ రోజు పుణ్య నదుల్లో స్నానం, తిల (నువ్వులు) దానం, గోదానం, వస్త్ర దానం చేయడం మహా ఫలదాయకరం. ఉపవాసం ఉండి శివుడు, విష్ణువు, దత్తాత్రేయుడు, పితృ దేవతల పూజ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. తమిళనాడులో ఇది “అరుద్రా దర్శనం”కు ముందు రోజు కావడంతో ప్రాముఖ్యత ఉంది. కేరళలో “త్రిక్కాకర అప్పన్” ఆరాధనకు సంబంధించిన రోజు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABPLive.com ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
దేవతల వాహనాలను ఆధునిక టెక్నాలజీతో ముడిపెడితే! ఆశ్చర్యపరిచే రహస్యాలు! eVTOL, AVATAR ఇంకా...