Mahashivratri 2026:  ఆది శంకరాచార్యలులు రచించిన అత్యంత వేదాంత రత్నం నిర్వాణ షట్కం. ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు.. మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే ఆత్మాన్వేషణ సాధన..

నిర్వాణ షట్కం ఎందుకు చదవాలి?

- నిజమైన నేను ఎవరో తెలుసుకునేందుకు చదవాలి

- అద్వైత వేదాంతంలో సారాంశం ఇది..నీవే ఆ పరమాత్మవి అని చెబుతుంది

- అహంకారం, మమకారం, ఆసక్తి తగ్గి వైరాగ్యం వస్తుంది - మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది

- మరణం భయం తొలగిపోతుంది - ఆధ్యాత్మిక జాగృతినిస్తుంది -  రోజువారి పని ఒత్తిడి, డ్రిపెషన్ , ఆందోళన తగ్గుతాయి

Nirvana shatakam

మనో బుధ్యహంకార చిత్తాని నాహంనచ శ్రోత్రం నజిహ్వా నచ ఘ్రాణనేత్రె |న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుఃచిదానంద రూపః శివోహం శివోహం ||

అర్థం: నేను మనసుని కాదు చిత్తాన్ని కాదు బుద్ధిని కాదు అహంకారాన్ని కాదు. నేను పంచేంద్రియాలైన  చెవి ముక్కు కన్ను నాలుక చర్మాన్ని కూడా కాదు.  భూమి, నీరు, అగ్ని, వాయువు , ఆకాశం అనే  పంచభూతాలను కూడా కానేకాదు. నేను చిదానంద రూపాన్ని శివుడిని.   నచ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుఃన వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూచిదానంద రూపః శివోహం శివోహం ||

నేను ప్రాణాన్ని నేను కాదు.  ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలుగా చెప్పే  పంచవాయువులను కాదు... రక్త, మాంస, మేధో, ఆస్థి, మజ్జా, రస, శుక్రములని చెప్పే  సప్త ధాతువులను కాదు.  అన్నమయ,ప్రాణమయ,మనోమయ, విజ్ఞ్యానమయ, ఆనందమయం గా చెప్పే పంచకోశాలను కాదు. కర్మేంద్రియాలైన వాక్కు,పాణి,పాద,పాయు,ఉపస్థను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.  న మే ద్వేషరాగౌ న మే లోభమోహోమదో నైవ మే నైవ మాత్సర్యభావః |న ధర్మో న చార్ధో న కామో న మోక్షఃచిదానంద రూపః శివోహం శివోహం ||

నాలో రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేనుకాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖంనమన్త్రో నతీర్ధం నవేదా నయజ్ఞః |అహం భోజనం నైవ భోజ్యం న భోక్తాచిదానంద రూపః శివోహం శివోహం ||

నాకు పాపపుణ్యాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.

నమే మృత్యు ర్న శంకా నమే జాతిభేదఃపితా నైవ మే నైవ మాతా న జన్మ |న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యఃచిదానంద రూపః శివోహం శివోహం ||

నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేనే లేవు. నాకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు,  గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. 

అహం నిర్వికల్పో నిరాకార రూపోవిభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |న చ సంగతం నైవ ముక్తిర్ న మేయ:చిదానంద రూపః శివోహం శివోహం ||

నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్న నాకు  మోక్షం  లేదు, బంధం  లేదు... నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.