Shukra Uday 2026: ఫిబ్రవరి 1న మాఘ పూర్ణిమ నాడు శుక్రుడు ఉదయిస్తాడు..2026 దీపావళి నవంబర్ 9న వచ్చింది. ఈ రోజు వరకూ ఉదయించే స్థితిలోనే ఉంటాడు. ఈ సమయం మేషం, వృషభం, మిథున రాశితో సహా అనేక రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. మాఘ పూర్ణిమ నాడు శుక్రుడు ఉదయించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
జ్యోతిష్యుడు అనిష్ వ్యాస్ ప్రకారం, మాఘ పూర్ణిమ నాడు శుక్రుడు ఉదయించడం వల్ల దీపావళి వరకు ఈ రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి.. ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందవచ్చు.
మేష రాశి
శుక్రుడు మీ రాశి నుంచి పదవ ఇంట్లో ఉదయిస్తాడు, ఇది పురోగతికి అవకాశాలను సృష్టిస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు సాధ్యమవుతాయి. చేపట్టిన పనిలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు స్థిర, చర ఆస్తుల నుంచి ప్రయోజనం పొందుతారు. నూతన ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ సమయం కలిసొస్తుంది. మిథున రాశి
మీ రాశి నుంచి శుక్రుడు ఆరో స్థానంలో ఉదయించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. అదృష్టం కలిసొస్తుంది. తక్కువ సమయంలో మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక రాశి
శుక్రుడు సంచారం మీ రాశి నుంచి ఏడవ ఇంట్లో ఉంటుంది. మీ వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీన రాశి
శుక్రుడు మీ రాశి నుంచి పదకొండవ ఇంట్లో ఉదయిస్తాడు, దీని వలన మీ ఆదాయం పెరుగుతుంది. బహుళ ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి . మీరు భూమి వాహనాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు
మాఘ మాసానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మహా మాఘీ అని పిలుస్తారు. శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన రోజు ఇది. ఈ రోజు నదీ స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణంలో ఉంది.
2026లో మాఘ పూర్ణిమ పంచాంగం ప్రకారం... మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1, 2026 ఆదివారం వచ్చింది
పౌర్ణమి తిథి ప్రారంభం - ఫిబ్రవరి 1 ఆదివారం తెల్లవారుజామున 05:46 గంటలకు.
పౌర్ణమి తిథి ముగింపు: ఫిబ్రవరి 2, సోమవారం తెల్లవారుజామున 04:09 గంటలకు.
ఉదయ తిథి: సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు సమయాల్లోనూ పౌర్ణమి ఉండడంతో ఫిబ్రవరి 1 ఆదివారం రోజే మాఘపౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు దేవతలు భూమిమీదకు వచ్చి పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తారని భక్తుల విశ్వాసం. ఈ రోజు చేసే స్నానం, దానానికి విశేష ఫలితం వస్తుంది. నదీస్నానం ఆచరించలేనివారు నువ్వులు దానం చేయండి. జాతకంలో గురుదోషం ఉన్నవారు నవగ్రహ ఆలయానికి వెళ్లి పూజ చేయండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
