Magh Purnima 2026: మాఘ పూర్ణిమ 2026  ఫిబ్రవరి 1 ఆదివారం వచ్చింది. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు.  జాతకంలో శని, రాహువు , కేతువుల మహాదశ కారణంగా ఏర్పడే ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు ఈ రోజు అత్యుత్తమం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. మాఘ పౌర్ణమి రోజు స్నానం ఆచరించి  కొన్నివస్తువులు దానం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నారు. మాఘపౌర్ణమి రోజు ఏం చేయాలి? దానం చేయాల్సిన వస్తువులేంటి? ఇక్కడ తెలుసుకుందాం.

గంగానదీ స్నానం

 మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం మాఘ మాసం అంతా గంగలో స్నానమాచరించినంత విశేష ఫలితం వస్తుందని నమ్ముతారు. ఈ రోజు దేవతలు భూమికి దిగివస్తారని.. విష్ణువుతో పాటూ నీటిలో కొలువై ఉంటారని చెబుతారు.  అందుకే మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానం, దానం వల్ల ఆనందం , అదృష్టం కలుగుతాయి. గంగాస్నానం ఆచరించే అవకాశం లేనివారు గంగ ఇంట్లో ఉంటే స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు..లేదంటే మీకు సమీపంలో ఉండే నదిలో స్నానం ఆచరించవచ్చు.  వస్త్రదానం

మీ జాతకంలో ప్రస్తుతం శనిమహాదశ నడుస్తుంటే మాఘ పూర్ణిమ రోజు నల్ల నువ్వులు, ఆవాల నూనె , నల్లని వస్త్రాలను దానం చేయండి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల శనిగ్రహం శాంతించి, మీ పనిలో అడ్డంకులు తొలగిస్తుంది చీమలకు ఆహారం

రాహువు ప్రతికూల ప్రభావం కారణంగా చదువులో సమస్యలు ఎదురవుతుంటే, ఉద్యోగంలో విజయం సాధించకపోతే, సంబంధాలలో చీలికలు ఉంటే, మాఘ పూర్ణిమ రోజు  కుక్కలకు, చీమలకు పిండి వేయండి... పేదలకు దుప్పట్లు దానం చేయండి బియ్యం దానం

కేతువు ప్రతికూల ప్రభావం నుంచి బయటపడేందుకు మాఘ పూర్ణిమ రోజు నలుపు ,  తెలుపు దుస్తులను దానం చేయాలి.  ఈ వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో కేతువుకు శుభం కలుగుతుందని , ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతారు. గోధుమలు దానం

సూర్యుడిని బలోపేతం చేయడానికి మాఘ పూర్ణిమ నాడు బెల్లం , గోధుమలను దానం చేయండి. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాలు, చక్కెర మిఠాయి , బియ్యం దానం చేయండి. కుజుడికి ఎర్రటి దుస్తులు, గోధుమలు, తేనె , నువ్వులు దానం చేయండి. పెసలు, ఉసిరి, పచ్చి కూరగాయలు

బుధుడిని శాంతింపజేయడానికి  పచ్చి కూరగాయలు, పెసలు,  ఉసిరికాయ  దానం చేయండి. బృహస్పతికి  పసుపు రంగు దుస్తులు, అరటిపండ్లు, పసుపు  పప్పుధాన్యాలు దానం చేయండి. శుక్రుడిని బలోపేతం చేయడానికి, తెల్ల నువ్వులు  నెయ్యి దానం చేయండి. ఇది భౌతిక సుఖాలను పెంచుతుంది. శుభ యోగాల సంయోగం

మాఘ పూర్ణిమ నాడు, ఆయుష్మాన్ యోగం, పుష్య నక్షత్రం, ప్రీతి యోగం , సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి, ఈ శుభ సంయోగాల సమయంలో చేపట్టే మతపరమైన కార్యకలాపాలు శుభ ఫలితాలను ఇస్తాయని విశ్వాసం

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.