Garuda Purana: రేప్ కేసు నిందితులు ఆత్మహత్య చేసుకుంటే నరకంలో ఎలాంటి శిక్షలుంటాయ్! గరుడ పురాణంలో ఏముంది?
Madanapalle Accused Suicide: మదనపల్లెలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్యా? శిక్షా? ఇలాంటి వారికి గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలున్నాయ్

Garuda Purana: ఆ మధ్య...కాకినాడ జిల్లా తునిలో బాలికపై లైంగికదాడికి పాల్పడిన తాటిక నారాయణరావు అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. న్యాయమూర్తి ముందు హాజరుపర్చేందుకు తీసుకెళుతుండగా బహిర్భూమికి వెళ్లాలంటూ వ్యాన్ దిగి వెళ్లి ఆ పక్కనే ఉన్న చెరువులో దూకి ప్రాణం తీసుకున్నాడు
ఆ మధ్య మరో అత్యాచార కేసు నిందితుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..
ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయ్. అత్యాచారానికి పాల్పడుతున్నారు...ఆ తర్వాత అరెస్ట్, శిక్షలు అనే భయంతో ప్రాణం తీసుకుంటున్నారు...
గరుడ పురాణం ప్రకారం చూసుకుంటే...
అత్యాచారం, హత్య చేసిన వారికి శిక్షలుంటాయ్...
ఆత్మహత్య కూడా మహాపాపం...దీనికి ప్రత్యేకంగా శిక్షలుంటాయ్..
అంటే.. వరుసగా రెండు తప్పులు చేస్తున్నారు.. ప్రాణం తీసుకుంటే ఆ తప్పు అక్కడితో సమసిపోతుంది శిక్షల నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారేమో...కానీ ఈ రెండూ మహాపాపాలే...గరుడపురాణం ప్రకారం శిక్షల నుంచి తప్పించుకోలేరు
అష్టాదశ పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన గరుత్మంతుడికి చెప్పిన విషయాలను వ్యాస మహర్షి రచించారు. గరుడ పురాణంలో మనిషి మరణం నుంచి ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది? ఆ ఆత్మ ఎక్కడెక్కడ తిరుగుతుంది? పాపం చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు? పుణ్యం చేస్తే ఎంత మంచి ఫలితాలు పొందుతారు? ఇవన్నీ వివరంగా ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న అత్యాచార ఘటనలు, ఆ నిందితుల ఆత్మహత్యలు పరిశీలిస్తే..వారికి వారే శిక్ష వేసుకుంటున్నారా? కొత్త శిక్షలు అనుభవించేందుకు సిద్ధమవుతున్నారా? ఇలాంటివారికి గరుడ పురాణంలో ఉన్న శిక్షలేంటో తెలుసా?
లలాభక్షం
గురడ పురాణం ప్రకారం అత్యాచారానికి పాల్పడే వారికి మాత్రమే కాదు..స్త్రీలను కామంతో చూసినా నరకంలో శిక్షలు మామూలుగా ఉండవ్. ఇలాంటి వారికి విధించే శిక్ష లలాభక్షం.... కుళ్లిపోయి కంపుకొడుతున్న వీర్యంతో నిండిన సముద్రంలో నిందితులను పడేస్తారు...
పుయోదకం
లైంగిక వేధింపులకు పాల్పడేవారు, అత్యాచారం చేసేవారికి నరకంలో విధించే శిక్ష పుయోదకం. పెద్ద బావిలో మల మూత్రాలు, రక్తం, శ్లేష్మం నింపి అందులో పడేస్తారు. వాళ్లు ఎప్పటికీ ఆ బావిలోనే ఉండిపోతారు
వజ్రకంఠకసలి
చిన్నారులు, స్త్రీలపైనే కాదు జంతువులపైనా అత్యాచారం చేసే అరాచకులున్నారు. ఇలాంటివారికి నరకంలో విధించే శిక్ష పేరు వజ్రకంఠసలి. సూదుల్లా ఉన్న పెద్ద లోహాలను గుచ్చి గుచ్చి వాటితో అమాంతం పైకెత్తి గాల్లో వేలాడదీసి శరీరాన్ని ఛిద్రం చేస్తారు
ఇక ఆత్మహత్య చేసుకున్నవారికి కూడా గరుడపురాణంలో ప్రత్యేక శిక్షలున్నాయి
గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య అనేది మహా పాపం. దేవుడిచ్చిన జీవితాన్ని తిరస్కరించడమే ఇది. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఆ తర్వాత "ప్రేత యోని"లో పడతాడు. అంటే ఆ ఆత్మ భూమిపై తిరుగుతూ ఆకలి, దాహంతో బాధపడుతుంది. ఎవరూ చూడలేరు, సహాయం చేయలేరు..అనంతకాలం బాధలు అనుభవిస్తుంది. వీరికి యమలోకంలోనూ భయంకరమైన శిక్షలుంటాయ్.
అసిపత్రవనం
ఇదో నరకం...ఇక్కడ శరీరాన్ని కత్తులతో కోస్తారు, నిప్పుల్లో కాలుస్తారు... సాధారణంగా ఆత్మహత్య చేసుకునేవారి కన్నా అత్యాచారం,హత్య చేసి ఆత్మహత్యలు చేసుకునేవారికి మరింత ఘోరమైన శిక్షలుంటాయ్. ఎందుకంటేవారు తమ పాపం కారణంగా ఎదుర్కొనే శిక్షల నుంచి తప్పించుకునేందుకు ప్రాణం తీసుకుంటారు..కానీ..కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్షలు తప్పవ్.
ఆధ్యాత్మిక కోణంలో చూస్తే..ఈ శిక్షలన్నీ భయపెట్టడానికి కాదు మనిషిని సన్మార్గంలో నడిపించడానికి. చిన్నారులపై అత్యాచారం చేసినవాడు సల్మలి, పుయోదకం వంటి నరకాల్లో బాధపడి ఆ తర్వాత జంతు యోనుల్లో జన్మిస్తారు. అత్యాచారం చేసి ఆత్మహత్య చేసుకున్నవారి పాపం మరింత పెరిగి ప్రేతాత్మలా తిరుగుతూ బాధలు పడతారు.
ఇలాంటి పాపాలు ఎందుకు పెరుగుతున్నాయ్?
ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం...కలియుగంలో ధర్మం తగ్గుతుంది.. మనిషి మనసు కలుషితమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక చింతన పెరగాలి. పాపాలు చేసిన తర్వాత బతికి ఉన్నప్పుడు అనుభవించే శిక్షలు, మరణం తర్వాత నరకంలో అనుభవించే శిక్షల గురించి తెలుసుకుని భయపడాలి.మత గ్రంథాలు చదవకపోయినా పర్వాలేదు కానీ చెడు కర్మలు చేయకుండా ఉండాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
























