Lunar Eclipse 2026 Date:  ఫాల్గుణ శుక్లపూర్ణిమ సంపూర్ణ చంద్ర గ్రహణం 2026 మార్చి 03 మంగళవారం ఏర్పడుతోంది.  పంచాంగం ప్రకారం గ్రహణ సమయం, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

సంపూర్ణ చంద్ర గ్రహణం గ్రహణం  స్పర్శకాలం - మధ్యాహ్నం గం॥ 3.19 ని॥  

సంపూర్ణ చంద్ర గ్రహణం నిమీలనకాలం - 4.33 

సంపూర్ణ చంద్ర గ్రహణం మధ్యకాలం - 5.03   మార్చి 3  సూర్యస్తమయ సమయం - 6 గంటల 2 నిముషాలు

మార్చి 3 చంద్రోదయ సమయం -  6 గంటల 4 నిముషాలకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉన్మీలన కాలం - 5.32  సంపూర్ణ చంద్ర గ్రహణం మోక్షకాలం - 6.46 సంపూర్ణ చంద్ర గ్రహణం బింబ దర్శనకాలం - 59 నిముషాలు

చంద్రగ్రహణ సమయం 42 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సంపూర్ణ  చంద్రగ్రహణం అయినప్పటికీ విడుపు సమయంలో 42 నిమిషాలు మాత్రమే బింబం కనిపిస్తుంది. అందుకే సూర్యాస్తమయం సమయం అయిన 6 గంటల 2 నిముషాలకు పట్టుస్నానం.. 6 గంటల 46 నిముషాలకు విడుపుస్నానం చేయాలి. గ్రహణం ప్రారంభమైన 3 గంటల 19 నిముషాల నుంచి స్నానం  చేయాల్సిన అవసరం లేదు.  అయితే భోజనం మధ్యాహ్నం 12 గంటల లోపు ముగించేయడం మంచిది మార్చి 3న ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం పుబ్బ నక్షత్రం, సింహరాశిలో సంభవిస్తోంది. అందుకే పుబ్బ నక్షత్రం వారు, సింహరాశివారు ఈ గ్రహణం చూడరాదు. ఉత్తర గోళం, అపసవ గ్రహణం, కేతుగ్రస్తం, నీలపింగళవర్ణం, మిశ్రమవర్ణంలో ఉంటుంది. ఈ గ్రహణం తూర్పు దిక్కున ప్రారంభమై.. తూర్పు ఆగ్నేయంలో నిమీలనం... దక్షిణ నైరుతిలో ఉన్మీలనం చెంది పశ్చిమం దగ్గర మోక్షం కలుగుతుంది. మనకు స్పర్శ, నిమీలనం, ఉన్మీలనములు కన్పించవు. మోక్షకాలమే దర్శనమిస్తుంది. 

సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తైన తర్వాత 6 గంటల 46 నిముషాలు దాటిన తర్వాత ఆహారం తీసుకోవాలి. గర్భిణిలు సాయంత్రం 5 గంటల నుంచి  6.46 వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది

ఏ రాష్ట్రంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఎంత సేపు కనిపిస్తుంది?

మార్చి 3న ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం ఈశాన్యరాష్ట్రాల్లో కనిపిస్తుంది. ముంబైలో చంద్రోదయం సా.6.45 పశ్చిమ ప్రాంతములందు కన్పించదు. మోక్షకాలంలోనూ గ్రహణం అక్కడ కనిపించదు. లక్షద్వీపంలోని కవరత్తీ, గుజరాత్ లో ద్వారకలో ఈ గ్రహణం కనిపించదు. కర్ణాటక రాష్ట్రం మంగుళూరులో 8 నిముషాలు, అహ్మదాబాద్లో 3 నిముషాలు, గాంధీనగర్ లో 3 నిముషాలు, పనాజీలో 7 నిముషాలు, శృంగేరీలో 11 నిముషాలు, ఉదయపూర్లో 8 నిముషాలు, గుజరాత్ వడోదరాలో 5 నిముషాలు కనిపిస్తుంది. 

తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం సమయం

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సంపూర్ణ చంద్రగ్రహణం  హైదరాబాద్ లో 24 నిముషాలు, విజయవాడలో 36 నిముషాలు, నల్గొండలో  27 నిముషాలు, నెల్లూరులో 28 నిముషాలు కనిపిస్తుంది సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయాలు ఉదయం నుంచి మూసివేసి మోక్షకాలం తర్వాత తెరిచి సంప్రోక్ష్య కార్యాలు నిర్వహిస్తారు.  

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మేష రాశి - మానసిక అశాంతి

వృషభ రాశి - సుఖం

మిధున రాశి - లాభం

కర్కాటక రాశి - వ్యయం

సింహ రాశి- ఘాతం

కన్యా రాశి - హాని

తులా రాశి - ధనలాభం

వృశ్చిక రాశి - వ్యధ

ధనస్సు రాశి - చింత

మకర రాశి-  సౌఖ్యం

కుంభ రాశి - స్త్రీ కష్టం

మీన రాశి - అతి కష్టం 

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.