Ksheerabdhi Dwadashi: కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి వివాహం జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 2న వచ్చింది. ఈ రోజు తులసి - శాలిగ్రామ్ ల వివాహం ఘనంగా నిర్వహిస్తారు. తులసిని కన్యాదానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఈ ఏడాది తులసి వివాహం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ రోజున శుక్రుడు తులా రాశిలోకి చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు చంద్రుని సంచారం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం.
కన్యా రాశి (Virgo Horoscope)
తులసి వివాహం రోజు నుంచి కన్యారాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. పని చేసే ప్రదేశంలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి, దీనివల్ల మీరు కొత్త పనులు ప్రారంభించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొంతకాలంగా వెంటాడుతున్న కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్య ఉద్యోగం కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీడియాలో పనిచేసే వారు కొత్త గుర్తింపును పొందుతారు.
తులా రాశి ( Libra Horoscope)
తులసి వివాహం సందర్భంగా ఏర్పడుతున్న శుక్ర-చంద్రుల శుభ యోగం వల్ల తుల రాశి వారికి చాలా లాభం కలుగుతుంది. వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగి అవివాహితులు ఓ ఇంటివారవుతారు. ఇప్పటివరకూ వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలుంటే అవి తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు సమసిపోతాయి. ఆస్తికి సంబంధించిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఇంట్లో శుభవార్త వినే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వ్యాపారులకు ఇది ఒక సువర్ణావకాశం, ఇందులో కొత్త సంబంధాలు అవకాశాలు విజయం వైపు కొత్త దారి తీస్తాయి. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది... మనస్సులో సానుకూల శక్తి సంచరిస్తుంది.
మీన రాశి (Pisces Horoscope)
మీన రాశి వారికి శుక్ర-చంద్రుల సంచారం వరం అనే చెప్పాలి. ఎల్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ సమయంలో కెరీర్లో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులు కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కెరీర్లో ఊహించని ఫలితాలు పొందుతారు. చాలా కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం సంబంధించిన ప్రతిపాదన రావచ్చు. స్నేహితులు మరియు సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద, తులసి వివాహం ఈ సమయం మీ జీవితంలో అభివృద్ధిని ఆనందాన్ని తెస్తుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఈ ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి