అన్వేషించండి

Ksheerabdhi Dwadashi 2025: క్షీరాబ్ధి ద్వాదశి నుంచి ఈ 3 రాశులవారికి అన్నీ మంచి ఘడియలే! మీ జాతకంలో మార్పులు, శుభ ఫలితాలు!

Tulsi Vivah 2025: నవంబర్ 02 తులసి వివాహం... ఈ రోజు శుక్రుడు, చంద్రుడు రాశుల మార్పుతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలున్నాయి.. ఇందులో మీరున్నారా?

Ksheerabdhi Dwadashi: కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి వివాహం జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 2న వచ్చింది. ఈ రోజు  తులసి -  శాలిగ్రామ్ ల వివాహం ఘనంగా నిర్వహిస్తారు.  తులసిని కన్యాదానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఈ ఏడాది  తులసి వివాహం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ రోజున శుక్రుడు తులా రాశిలోకి  చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు  చంద్రుని సంచారం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం.

కన్యా రాశి (Virgo Horoscope)

తులసి వివాహం రోజు నుంచి కన్యారాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. పని చేసే ప్రదేశంలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి, దీనివల్ల మీరు కొత్త పనులు ప్రారంభించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొంతకాలంగా వెంటాడుతున్న కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్య   ఉద్యోగం కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీడియాలో పనిచేసే వారు కొత్త గుర్తింపును పొందుతారు.

తులా రాశి ( Libra Horoscope)

తులసి వివాహం సందర్భంగా ఏర్పడుతున్న శుక్ర-చంద్రుల శుభ యోగం వల్ల తుల రాశి వారికి చాలా లాభం కలుగుతుంది. వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగి అవివాహితులు ఓ ఇంటివారవుతారు. ఇప్పటివరకూ వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలుంటే అవి తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు సమసిపోతాయి. ఆస్తికి సంబంధించిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఇంట్లో శుభవార్త వినే  అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వ్యాపారులకు ఇది ఒక సువర్ణావకాశం, ఇందులో కొత్త సంబంధాలు అవకాశాలు విజయం వైపు కొత్త దారి తీస్తాయి. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది... మనస్సులో సానుకూల శక్తి సంచరిస్తుంది.

మీన రాశి (Pisces Horoscope)

మీన రాశి వారికి శుక్ర-చంద్రుల సంచారం వరం అనే చెప్పాలి. ఎల్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ సమయంలో కెరీర్లో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులు కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కెరీర్లో ఊహించని ఫలితాలు పొందుతారు. చాలా కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం సంబంధించిన ప్రతిపాదన రావచ్చు. స్నేహితులు మరియు సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద, తులసి వివాహం ఈ సమయం మీ జీవితంలో అభివృద్ధిని ఆనందాన్ని తెస్తుంది.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఈ ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి. 

2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
తప్పు దిశలో పెట్టిన డెస్క్ పురోగతిని నిరోధిస్తుందా? వాస్తుతో మీ కెరీర్ ఎదుగుదల రహస్యాన్ని తెలుసుకోండి
తప్పు దిశలో పెట్టిన డెస్క్ పురోగతిని నిరోధిస్తుందా? వాస్తుతో మీ కెరీర్ ఎదుగుదల రహస్యాన్ని తెలుసుకోండి
Embed widget