Karungali Mala : ఈ మధ్య కాలంలో భారత దేశంలో ఆధ్యాత్మిక, సంప్రదాయాలు, ఆరోగ్య ప్రయోజనాల పట్ల ప్రజల ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే కరుంగలి మాల(Karungali Mala) గురించి చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మాల ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి గ్రహ దోషాల నివారణ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ మాల గురించి పూర్తి అవగాహన లేకపవడం మార్కెట్‌లో నకిలీ మాలలు అమ్మకం జరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కరుంగలి మాల చరిత్ర, ప్రయోజనాలు, ధరించే నియమాలు, నకిలీ మాలల గుర్తించే విధనాలను ఈ స్టోరీలో చూద్దాం.
కరుంగలి మాల అంటే ఏంటీ?(what is Karungali Mala )కరుంగలి మాలను జమ్మిచెట్టు కాండం, బెరుడు నుంచి తయారు చేస్తారు. ఈ చెట్టును ఆంగ్లంలో ఎబోనీ అని పిలుస్తారు. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో వేగంగా పెరుగుతుంది. దీని కలప నల్లగా, గట్టిగా బరువుగా ఉంటుంది. పురాతన కాలంలో భారత దేశంలో రాజులు ఈ కలపను రాజదండాలుగా, చిత్రాల తయారీకి ఉపయోగించేవారు. ఈ చెట్టు కలపను పియానో కీలు, కత్తులు, హ్యాండిల్స్, టర్న్ ఆర్టికల్స్ వంటి వస్తువులు తయారీకి కూడా ఉపయోగించేవాళ్లు. కరుంగలి మాలను సాధారణంగా 108 పూసలతో తయారు చేస్తారు. ఇవి నలుపు రంగులో ఉంటాయి. ఈ మాలలు ఎక్కువగా తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో తయారు అవుతాయి.
చరిత్రలో కరుంగలి మాల (Karungali Mala History)పురాతన కాలంలో హిందూ సంప్రదాయాల్లో కరుంగలి మాలలు, రుద్రాక్షలు వంటి హారాలను ఆధ్యాత్మిక ఆచారాల్లో భాగంగా ధరించే వాళ్లు. ఆ కాలంలో క్షత్రియులు, రాజులు ఈ మాలలు ధరించే ధైర్యం,శక్తి, దైవ రక్షణ పొందేవాళ్లను చెబుతారు. కానీ బ్రిటీష్ పాలన కాలంలో ఈ సంప్రదాయాలు కొంత వరకు మరుగునపడ్డాయి. స్వాతంత్య్రం తర్వాత మళ్లీ ఈ సంప్రదాయాలు పునరుద్ధరణ జరిగింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా కరుంగలి మాల గురించి అవగాహన విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.
కరుంగలి మాల ధరించడం వల్ల ప్రయోజనాలు(Uses Of Karungali Mala )కరుంగలి మాల ధరించడం వల్ల అనేక ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ మాల ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, పెరుగుతాయని చెబుతారు. జ్యోతీష్య నిపుణులు ఈ మాల అంగాకరక గ్రహ చెడు ప్రభావాలను తగ్గిస్తుందని, గ్రహ దోషాలు, వాస్తుల దోషాలు నివారిస్తుందని పేర్కొంటారు. విద్యార్థులకు ఈ మాల జ్ఞాపకశక్తి, మేథో శక్తిని మెరుగుపరుస్తుందని, విద్యలో రాణించడానికి ఉపయోగపడుతుందని చెబుతారు. వ్యాపారవేత్తలు, ఉద్యోస్తులు, కరుంగలి మాల ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఆరోగ్య పరంగా, ఈ మాల నెగిటివ్ ఎనర్జీని తొలగించి, పాజిటివ్ ఆలోచనలను పెంపొందిస్తుందని, అలాగే ఎలక్ర్టానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్‌ల నుంచి వచ్చే రేడియేషన్ తగ్గిస్తుందని కొందరు అంటున్నారు.
ధరించే నియమాలు(Rules And Regulations OF Karungali Mala )కరుంగలి మాల ఒక పవిత్రమమైన హారంగా పరిగణిస్తారు. కాబట్టి దీనిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని కొందరు సూచిస్తున్నారు. ఈ మాలను ధరంచినప్పుడు మద్యపానం, మాంసాహారం, శృంగారంలో కార్యక్రమాల్లో పాల్గొనకూడదని అంటారు. ఇటువంటి చర్యలు చేస్తే మాలలోని శక్షి క్షీణించి, అది వినియోగానికి పరికిరాకపోవచ్చని వారి నమ్మకం. స్త్రీలు నెలసరి సమయంలో మాలను తీసి, పూజా మందిరంలో భద్రపరిచి, నెలసరి పూర్తి అయిన ఆరో రోజు ఉదయం స్నానం చేసి ధరించాలని అంటున్నారు. సాధారణంగా ఈ మాలను రోజంతా ధరించవచ్చు. కానీ రాత్రి సమయంలో తీసి పూజ మందిరంలో ఉంచి, మరుసరటి రోజు ఉదయం స్నానం తర్వాత ధరించాలని సూచిస్తున్నారు. సుబ్రహ్మణ్యస్వామి మూల మంత్రం ఉపదేశం ఉన్న వారు ఈ మాల ధరించి స్వామి జపం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. మూల మంత్రం ఉపదేశం లేనివారు స్కందాయ నమః అని నామ స్మరణ చేస్తూ స్వామిని పూజించవచ్చు. మంగళవారం రోజున స్కంద అభిషేకంలో ఉంచిన కరుంగలి మాలను మరో మంగళవారం రోజున ధరించడం శుభప్రదమని చెబుతారు.
నకిలీ కరుంగలి మాలను ఎలా గుర్తించాలి?(Fake Karungali Mala )మార్కెట్‌లో కరుంగలి మాలలకు డిమాండ్ పెరగడంతో నకిలీ మాలలు కూడా అమ్మకం జరుగుతోంది. ఒరిజినల్ మాలను గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. అసలైన కరుంగలి మాల బరువు తక్కువగా ఉంటుంది. నకిలీ మాలల బరువు ఉంటాయి. ఒరిజినల్ మాల పూసలు నలుపు రంగులో, సహజమైన ఆకృతితో ఉంటాయి. కొన్ని నకిలీ మాలలను ప్లాస్టిక్ పూసలతో తయారు చేస్తారు. వీటిని నీటి పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
ఒరిజినల్ కరుంగలి మాలను నీటిలో పెడితే రంగు మారడానికి కనీసం 12 గంటల సమయం పడుతుంది. కానీ నకిలీ మాలలు కేవలం గంటలోపే రంగు మారుతాయి. కొందరు వ్యాపారులు రంగు మార్పు కోసం ప్రత్యేక పదార్థాలను ఉపయోగిస్తారని కూడా తెలుస్తోంది. ఈ మాలలు ఆన్‌లైన్‌లోనే ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో, స్థానిక షాపుల్లో, రుద్రాక్ష ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో లభిస్తాయి.
మార్కెట్‌లో ధర ఎంత ఉంటుంది(Cost Of Karungali Mala )కరుంగలి మాలలు 6mm, 7mm, 8mm వంటి సైజ్‌లలో లభిస్తాయి. ఈ మాలల ధరలలు సైజు, నాణ్యత, తయారీ ప్రదేశం ఆధారంగా మారుతుంటాయి. సాధారణంగా ఆన్‌లైన్‌లో ఒక మంచి నాణ్యత కలిగిన కరుంగలి మాల ధర 500 నుంచి 2000 వరకు ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు నకిలీ మాలలను అమ్మడం, తప్పుడు సమాచారం ఇవ్వడంతో ద్వారా వినియోగదారులు మోసం చేస్తున్నారు.
కరుంగలి మాల గురించి సోషల్ మీడియా ద్వారా అవగాహన పెరగడంతో భారీ సంఖ్యలో ఈ మాలలను కొనుగోలు చేస్తున్నారు. అయితే నకిలీ మాలల కారణంగా నష్టపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ విషయంలో జాగ్రత్త అవసరం ఉంది.