Arguments Against Commercialization:
దేవుళ్లను కమర్షియల్ చేయడం కరెక్టేనా?
సినిమాల్లో విపరీతంగా పెరిగిన దేవుళ్ల వాడకం..
కాసుల కోసం భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవడం సరైన చర్యేనా?
సినిమాల్లో దేవుళ్ల ప్రస్తావన ఉండటం తప్పు కాదు. ధర్మ పరిరక్షణ కోసం బలమైన సామాజిక మాధ్యమమైన సినిమాలు ఆధ్యాత్మికతను ఆశ్రయించటం ఒక విధంగా మంచిదే. గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు భగవత్ కృపను ప్రజలందరికీ పంచాయి. కానీ ఇదంతా ఓ బాధ్యతతో జరగాలి తప్ప ప్రేక్షకుల మనోభావాల్ని రెచ్చగెట్టడం కోసమో లేదా వాళ్లను థియేటర్లకు రప్పించటం కోసమో దేవుడి పేరును వాడుకోవటం ధర్మానికి చేసే మోసం కింద జమకట్టాలేమో. ఒకటి కాదు రెండు కాదు ఇటీవల అనేక సినిమాల్లో భగవత్ ప్రస్తావన లెక్కకు మించి ఉంటోంది. అయితే అది ధర్మానికి నిజంగా ఉపయోగపడుతుందా లేదా సదరు కథనాయకుడి వీరత్వ ప్రదర్శనకు వాడబడుతోందా అనేదే ఇక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న.
అసలు తమ స్వలాభం కోసం దేవుళ్లను వాడుకునేవారికి గరుడపురాణంలో ఎలాంటి శిక్షలుంటాయ్?
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. శ్రీ మహావిష్ణువు తన వాహనం అయిన గరుత్మంతుడికి ఉపదేశించిన గరుడ పురాణంలో మనిషి జీవితం, మరణం, పాప పుణ్యాలు, నరకాలు, మోక్షం గురించి వివరంగా ఉంది.
అయితే దేవుడి ఎలిమెంట్ వాడి భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవడం సరైనదేనా అంటే..గరుడ పురాణ ప్రకారం సరికాదు. దేవతలను అవమానించడం, నిందించడం, దుర్వినియోగం చేయడం, వ్యాపారం కోసం వాడుకోవడం తీవ్రమైన పాపాలుగా పరిగణిస్తారు. ఇవి అహంకారం, లోభం కారణంగా జరుగుతాయి..దేవతల పవిత్రతను దెబ్బతీస్తాయి. గరుడ పురాణంలో ఇలాంటి పాపాల గురించి ప్రేత ఖండం , ఉత్తర ఖండంలో వివరంగా ఉంది. ఇలాంటి పాపాలు చేసేవారికి నరకంలో శాశ్వత బాధలు, శరీర విచ్ఛిన్నం, అగ్ని బాధలు తప్పవు. కర్మఫలితం ఆధారంగా శిక్షల తీవ్రత పెరుగుతుంది 1. దేవుళ్లను అవమానంచడం లేదా నిందించడం
దేవతానాం నిందనం చ పాపం తీవ్రం భవేత్
ఇలాంటి వారికి నరకంలో తమిశ్రం, రౌద్రం అనే శిక్షలుంటాయి. శాశ్వత వేదన, శరీరాన్ని కాల్చి విచ్ఛిన్నం చేయడం చేస్తారు
2. దేవతలను దుర్వినియోగం చేయడం ( అనర్హమైన ఉపయోగం - పవిత్రత దెబ్బతీయడం)
దేవతాః కామకాశ్చైవ దుర్వినియోగకరాః స్మృతాః
ఇలాంటి కర్మలు చేసేవారికి క్రిమిభూమి, కుంభీపాకం తప్పదు - అంటే కీటకాలు శరీరాన్ని తినేస్తాయి, శరీరం నూనెలో మరిగి విచ్ఛిన్నం అవుతుంది
3. దేవతలను కమర్షియల్ చేయడం ( లాభం కోసం వాడేయడం - భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవాలి అనుకోవడం) దేవతాః కామకాశ్చైవ విక్రయః పాపకర్మ చ
ఈ కర్మలు చేసేవారికి సంజీవని నరకం, రురు నరకం తప్పదు - ఇందులో పునర్జన్మ అనేదే లేకుండా బాధలు పెడుతూనే ఉంటారు
గరుడపురాణంలో మరిన్న శ్లోకాలు - వివరణ
దేవతలను అవమనించేవాడు, నిందించేవాడు లేదా దుర్వినియోగం చేసేవాడు తీవ్రమైన పాపం చేసినట్టే. దీనికి సంబంధించి అధ్యాయం 6/19-20లో ఉంది. ఇలాంటి చర్యలు నరకంలో శాశ్వత బాధను కలిగిస్తాయి. సినిమాల్లో దేవుడి ఎలిమెంట్ ను లాభం కోసం వాడుకోవడం ఈ కోవకే చెందుతుంది అహంకారం మాత్సర్యం చ దేవతాభ్యః క్రియాతే
భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవాలి అనుకోవడం అహంకారం వల్లనే జరుగుతుందని గరుడపురాణం ఉత్తర ఖండంలో ఉంది. దురాచారే రక్తపిచ్ఛితే నరకే పతితం
దేవతల దుర్వినియోగం దురాచారమే అని గరుడపురాణం చెబుతోంది. ఇది నరకంలో రక్తబాధలు కలిగించే శిక్షలు వేస్తుంది ఇంకా .. దేవాలయాల ఆస్తులు దోచుకునేవారు, యజ్ఞయాగాలను అడ్డుకునేవారు, ధర్మానికి హాని కలిగించేవారు, వేదాలను తిరస్కరించేవారికి గరుడపురాణంలో క్రిమిభోజనం శిక్ష తప్పదు
ధర్మాన్ని విడిచిపెట్టి దేవుడిని నిందించేవారకి అసిపత్రవనం శిక్ష ఉంటుంది
ఇతరులను స్వలాభం కోసం వినియోగించుకునేవారికి క్రిమిభోజనం ( పురుగులు, పాములు తింటాయ్) ఇతరులను మోసం చేసి లాభపడేవారికి మహా రౌరవం (దయ్యాలు పీక్కుతింటాయి)
అన్యాయమైన మార్గాల్లో కుటుంబాన్ని పోషించేవారికి అంధతామిస్రం శిక్షలుంటాయి ( చీకటి బాధలు)
గరుడ పురాణం మనిషిని మంచి పనులు చేసి జీవించమని బోధిస్తుంది. దేవతలను భక్తితో పూజించాలి కానీ వారిని స్వలాభం కోసం వాడుకునేవారు గరుడపురాణం ప్రకారం పాపాత్ములే..వీరికి నరకంలో శిక్షలు తప్పవు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఈ జన్మలో ఆర్థిక కష్టాలు, మానసిక బాధలు అనుభవించి మరణానంతరం నరకానికి వెళతారు. కర్మ ఫలితం ఆధారంగా పాపాలన్నింటినీ నరకంలో అనుభవించి శుద్ధి అయన తర్వాత మరు జన్మఎత్తుతారు. అందుకే ఇలాంటి పాపాలు చేయకుండా ధర్మమార్గంలో నడవమని బోధిస్తుంది గరుడపురాణం.
ఇదంతా భయపెట్టడం కోసం కాదు..మంచి జీవితం కోసం మార్గదర్శకత్వం