Adhikmaas Amavasya 2023:  హిందువులు అమావాస్యను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ ఏడాది శ్రావణం అధికమాసం వచ్చింది. ఆగష్టు 16తో అధికమాసం ముగిసి ఆగష్టు 17 నుంచి నిజ శ్రావణం ప్రారంభం కానుంది. అంటే ఆగష్టు 16న అధిక అమావాస్య వచ్చింది. ఈ రోజుని మరింత ప్రత్యేకంగా భావిస్తారు.  అమావాస్య రోజున పవిత్ర నదీస్నానం దానం చేయడం, పూర్వీకులకు తర్పణాలు విడిచిపెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతామని విశ్వసిస్తారు. ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు విడిచిపెడితే ఆ కుటుంబాలను వెంటాడుతున్న పితృదోషంతో పాటూ కాలసర్పదోషం కూడా హరిస్తుంది. ఈ అమావాస్య ఆగష్టు 15 మధ్యాహ్నం నుంచి మొదలుకావడంతో ఏరోజు అమావాస్య అన్నది కొంత గందరగోళం ఉంది కానీ... సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటారు కావున ఆగష్టు 16న అమావాస్య వచ్చింది.


అమావాస్య రోజు ఏం చేయాలి
 సూర్యోదయానికి అమావాస్య ఉన్నందున నదీ స్నానాలు, తర్పణాలు ఈ రోజే చేయాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి. ఆషాఢ అమావాస్య రోజున గంగాస్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే గంగానదిలో స్నానం చేయండి. నదీ స్నానాలు చేసే అవకాశం లేనివారు ఇంట్లో ఉన్న గంగాజలాన్ని కొద్దిగా కలుపుతుని ఇంట్లోనే స్నానమాచరించినా మంచి ఫలితం ఉంటుంది. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించే చాలా మంచిది. ఇంటి ముందుండే తులసికి నీళ్లు సమర్పించి దీపం వెలిగించి నమస్కరించాలి. ముఖ్యంగా రావి చెట్టు చుట్టూ దారం కట్టి 108 సార్లు ప్రదిక్షిణ చేస్తే ఏం కోరుకుంటే అవి నేరవేరుతాయని పండితులు చెబుతారు. 


Also Read: ఆగష్టు 16 రాశిఫలాలు, అధికమాసం ఆఖరిరోజు ఈ రాశులవారికి శుభసమయం


అమావాస్య రోజు ఆచరించాల్సిన విధులివి



  • పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ,ఆనపకాయ దానంగా ఇవ్వొచ్చు

  • అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి

  • అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటు పోసుకోరాదు

  • అమావాస్య రోజు ఒకపూట భోజనం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది

  • అమావాస్య రోజు బీదలకు సహాయం చేయండి, పశుపక్ష్యాదుల దాహం తీర్చండి

  • గోవులకు ఆహారం అందించండి

  • ఈరోజు శుభకార్యాలు చేయొద్దు, శాంతి కర్మలు చేయొచ్చు

  • అమావాస్య రోజు తలకి నూనె పెట్టుకున్నా, క్షురకర్మలు చేయించుకున్న దారిద్ర్యం వెంటాడుతుంది

  • అమావాస్య రోజు ఇల్లు కడికి సాంబ్రాణి ధూపం వేయాలి

  • ఈ రోజు కొత్త పనులు ప్రారంభించవద్దు..పాత పనులు అపొద్దు

  • ఈ రోజు అన్నదానం, వస్త్రదానం చేయాలి.. కమలాలతో లక్ష్మీపూజ చేయాలి

  • అమావాస్య రోజు శివుడిని పూజిస్తే ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

  • ఏదైనా గుడిలో రావి మొక్క నాటడం వల్ల పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి, ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది


Also Read: మీ దంతాలు ఊడినట్టు కలొచ్చిందా - అది దేనికి సంకేతమో తెలుసా!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.