మేషరాశి : ఈరాశి వారికి ఈరోజు అన్నిటా అనుకూల వాతావారణం నెలకొని ఉంటుంది. వివాహ కార్యక్రమాలు సఫలమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొని ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
వృషభం రాశి : ఈరాశి వారికి ఈరోజు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధననష్టం ఉంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే విషయంలో ఆచితూచి వ్యవహరించడం ముఖ్యం. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడాలి.
మిథున రాశి : రుణప్రయత్నాలు అంతగా అనుకూలించవు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
కర్కాటక రాశి : ఈరోజు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయడం మంచిది. మనసు చంచలంగా ఉంటుంది. మనో నిగ్రహానికి ధ్యానం చేయడం చెప్పదగిన సూచన. కుటుంబం విషయంలో అశ్రద్ద పనికిరాదు.
సింహ రాశి : ఈరోజు ఈరాశి వారికి వృత్తి, ఉద్యోగరంగాల్లో సానుకూలంగా ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ధనలాభం ఉంది. మానసిక ఆందోళన చెందుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తుంది.
కన్యారాశి : ఈరోజు మీరు చేసే శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. సమయానికి డబ్బు చేతికందుతుంది. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనువైన కాలం.
తులరాశి : ఇప్పటివరకు ఉన్న భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. కుటంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించడం అవసరం. .
వృశ్చిక రాశి : ప్రయాణాల్లో వ్యయప్రయాసలు ఉంటాయి. ఆకస్మిక ధననష్టం ఉంది. తీర్థయాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. దైవదర్శనం ఉంటుంది. మనోల్లాసంతో కాలం గడుపుతారు. అనారోగ్య బాధలు తొలుగుతాయి.
ధనుస్సు రాశి : ఈరోజు నిరుత్సాహంతో ఉంటారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. అపకీర్తి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి.
మకర రాశి : మనసు చంచలంగా ఉంటుంది. ఆడవారితో తగాదాలు ఏర్పడే అవకాశం. స్వల్ప అనారోగ్యంగా ఉంటారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు ఉంటాయి. కుంభ రాశి : ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీరుతాయి. ధైర్యసాహసాలు కలిగి ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్తు ఆభరాణాలు పొందుతారు..
మీనరాశి ఈరోజు ఈరాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సఫలీకృతం అవుతాయి. ముఖ్యమైన పని పూర్తవుతుంది.