ఫిబ్రవరి 9 బుధవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు మీరు చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.  ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి సహాయంతో పెద్ద సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఉద్యోగులకు బదిలీలు ఉండొచ్చు. 


వృషభం
పెద్దల సలహాతో నిలిచిపోయిన మీ పనులు ముందుకు సాగుతాయి. కొత్త ఇల్లు కొనడానికి ప్రణాళిక వేస్తారు. బంధువులను కలవడానికి వెళతారు. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. విద్యార్థులు  చదువుపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. 


మిథునం
శత్రువు అడ్డంకి కారణంగా మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పితృ సంబంధ విషయాల్లో బంధువులతో వివాదాలు తలెత్తవచ్చు. యువత ఉద్యోగాల కోసం ఓపిక పట్టాలి. ఈరోజు అనవసరమైన ఖర్చులు ఉండొవచ్చు.


కర్కాటకం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో తిరోగమనం ఉంటుంది. స్నేహితులతో వాగ్వాదం జరుగుతుంది. కార్యాలయ బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. 


సింహం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడంతో పాటు చేతుల్లో కొత్త పనులను చేపట్టగలుగుతారు. చెడు అలవాట్లను నియంత్రించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది.


కన్య
ఈరోజు ప్రత్యర్థుల కారణంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో ఏదైనా విషాదం జరిగే సూచనలున్నాయి.  ఎలాంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తారు. నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం వరిస్తుంది.


తుల
ఈరోజు మీకు మంచి రోజు. పని ఒత్తిడి తగ్గుతుంది, చాలా కాలంగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం కావడంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వేరేవారి సమస్యలు పరిష్కరించడానికి మీరు సహకరిస్తారు. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. పిల్లల సమస్యలు పరిష్కరిస్తారు. 


వృశ్చికం
ఈ రోజు మీరు ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి బంధువుల ఇళ్లకు వెళతారు. చాలా రోజులుగా ఉన్న సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. గృహావసరాలను సేకరించవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి.


ధనుస్సు 
ఈ రోజు మీరు ఒకరి తప్పులను వేలెత్తి చూపిస్తారు. మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. చిరాకు పెరుగుతుంది. పెద్దల సలహాలు పాటించాలి. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. సోదరుల అవసరాలు తీరుస్తారు.


మకరం
భవిష్యత్తు ప్రణాళికలను నిర్ణయించుకోవడంలో ఈ రోజంతా గడిచిపోతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ పనులు పూర్తి చేసేందుకు వేరే ఊరికి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు.


కుంభం
విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ బాధ్యతను సకాలంలో నిర్వర్తించగలరు. ఎవరికైనా సహాయం చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంపట్ల అజాగ్రత్తగా ఉండొద్దు.


మీనం
ఈ రోజంతా  చాలా బిజీగా ఉంటుంది. మీరు క్రీడలు లేదా ఇతర ఈవెంట్లలో పాల్గొనవచ్చు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారులను కలవాల్సి వస్తుంది.