మేషం - మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు దానికి మంచి రోజు. మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. కోపాన్ని నివారించండి, అది మీ అనారోగ్యానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో సమస్యలేవీ ఉండవు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.
వృషభం - ఈ రోజు మీ వ్యాపార ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇందుకు మీరు వ్యాపారానికి తగిన ప్రచారం చేపట్టాలి. వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వల్ల మీరు ఆసుపత్రిపాలు కావచ్చు. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది.
మిథునం - అధికారుల సహాయం మీకు లభిస్తుంది. తెలియని వ్యక్తులకు సహాయం చేస్తారు. ఇంట్లో అనారోగ్యానికి గురైన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
కర్కాటకం - ఉద్యోగాలు చేసే వ్యక్తులు, సహోద్యోగులను నిశితంగా గమనించండి. ఈ వ్యక్తులు మిమ్మల్ని విమర్శించవచ్చు. మీ ఇమేజ్‌ను పాడు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు ఈరోజు ఏదో ఒక మోసానికి గురయ్యే అవకాశం ఉంది. లగ్జరీ వస్తువుల వ్యాపారులు లాభపడగలరు. షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి.
సింహం - అందరితో కలసి పని చేస్తేనే విజయం లభిస్తుంది. వృద్ధులను, స్త్రీలను గౌరవించండి. ఎవరితోనూ పరుషమైన మాటలు మాట్లాడవద్దు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఉండవచ్చు. వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదు. పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది.
కన్య - విద్యార్థుల్లో పోటీతత్వం కనిపిస్తుంది. మీరు కొన్ని పనుల నిమిత్తం బయటకు వెళ్లవలసి రావచ్చు. ఎవరినీ దుర్భాషలాడవద్దు. వ్యాపారంలో లాభం ఉంటుంది. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. అధిక పని అలసటకు కారణమవుతుంది. మీరు స్నేహితుల మద్దతు పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడతారు.
తుల - ప్రస్తుతం వ్యాపారంలో భాగస్వామ్యం అంత మంచిది కాదు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఏదైనా భాగానికి గాయమయ్యే అవకాశం ఉంది. అహంభావాన్ని వదులుకోండి. కొంతమంది స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. మీ నైపుణ్యం, నాయకత్వ సామర్థానికి ప్రశంసలు లభిస్తాయి.
వృశ్చికం - ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆఫీసు వాతావరణం సాధారణంగా ఉంటుంది. చిల్లర వ్యాపారులు లాభపడతారు. వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దు, అజాగ్రత్తగా ఉండకండి. కార్యాలయ బాధ్యతలు నిర్వర్తించకపోతే అధికారులు అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీలకు బహుమతులు ఇవ్వండి.
ధనుస్సు - ప్రమోషన్ కోసం వేచి చూడాల్సి వస్తుంది. మందుల వ్యాపారులకు లాభాలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం - మాటలను అదుపులో ఉంచుకోండి, ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు. వ్యాపారంలో నిర్లక్ష్యం మీపై భారంగా ఉంటుంది. అవసరమైన పత్రాలను తమ వద్ద ఉంచుకునే ఎలక్ట్రానిక్ వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. వెన్నునొప్పి, కండరాలు పట్టే అవకాశం ఉంది. బరువులు ఎత్తడం మానుకోండి.
కుంభం - సోమరితనం వద్దు. అది మీ కెరీర్‌కు అడ్డంకిగా మారుతుంది. ఇంజనీర్లు ప్రమోషన్ పొందవచ్చు. బీమా రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి కస్టమర్లను పొందుతారు. హై బీపీ ఉన్నవారు అజాగ్రత్తగా ఉండకూడదు. ఇంటి మరమ్మతులకు ఖర్చులు ఉంటాయి.
మీనం - ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఎగుమతి-దిగుమతి వ్యాపారాలు చేసే వారికి అదృష్టం తోడ్పడుతుంది. మీకు అలసటగా, బలహీనంగా అనిపించవచ్చు. పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోండి. వృత్తిలో పురోగతి ఉంటుంది.
Also Read: రక్షా బంధన్ కుడిచేతికి కట్టడం వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు