Guru Pradosh Vrat 2026: పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి నూతన సంవత్సరానికి స్వాగం పలికే సమయాన్ని ఓ వేడుకలా జరుపుకుంటారు. సంబరాలు, సంతోషాలు, ఆటపాటలు, కేట్ కట్ చేయడాలు...ఎక్కడ చూసినా సందడే సందడి. అయితే డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా కానీ జనవరి 1 గరువారం మీరు పాటించాల్సిన నియమాలను మర్చిపోవద్దు. 

Continues below advertisement

ధార్మికంగా చూస్తే ఈసారి కొత్త సంవత్సరం 2026 ప్రారంభం చాలా శుభప్రదంగా ఉందని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు.  ఇందుకు కారణం ఏంటంటే కొత్త సంవత్సరం రోజున, అంటే జనవరి 1, 2026 గురువారం నాడు గురు ప్రదోష వ్రతం ఏర్పడుతోంది. ప్రదోష వ్రతం శివునికి అంకితం చేసినది. అదే సమయంలో గురువారం విష్ణువును పూజించడానికి ఉత్తమమైనదిగాచెబుతారు

ప్రదోష వ్రతం అనేది ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది. కృష్ణపక్షం-శుక్లపక్షంలో త్రయోదశి తిథి రోజు శివారాధనకు అత్యుత్తమం అని చెబుతారు. ఈ తిథి గురువారం వస్తే గురు ప్రదోష వ్రతం అంటారు. గురువారం గురు గ్రహానికి(బృహస్పతి)కి సంబంధించినది. అందుకే గురువారం రోజు వచ్చే ప్రదోషవ్రతం ఆచరిస్తే గురుగ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతారు. జ్ఞానం, విద్య, ఆధ్యాత్మిక పురోగతి, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేని దంపతులు, వివాహం ఆలస్యం అయినవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు పొందుతారు

Continues below advertisement

సంవత్సరం 2026 మొదటి రోజు గురువారం. ఈ రోజు పుష్యమాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి కూడా ఉంటుంది, ఇది శివుని పూజకు అంకితం చేయబడింది. అదే సమయంలో, గురువారం విష్ణువును ఆరాధించడానికి చాలా పవిత్రమైన రోజు. గురువారం ప్రదోష వ్రతం కలయిక కారణంగా, దీనిని గురు ప్రదోష వ్రతం అంటారు. కొత్త సంవత్సరంలో మహాదేవుడు -  నారాయణుడిని పూజిస్తారు.

గురు ప్రదోష వ్రతం  చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి.. బృహస్పతి గ్రహం  శుభత్వం ద్వారా జ్ఞానం, సంతోషం, అదృష్టం పెరుగుతుంది. జనవరి 1, 2026 నాడు శివుడు , విష్ణువులను పూజించడం వల్ల   రోగాల నుంచి విముక్తి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

పూజా సమయం

నూతన సంవత్సరం ఉదయం విష్ణుపూజ

జనవరి 1, 2026 గురువారం నాడు ఉదయం విష్ణువును విధివిధానంగా పూజించి నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. దేవునికి పసుపు రంగు పువ్వులు,  పసుపు రంగు నైవేద్యం సమర్పించండి.  "ఓం నమో నారాయణాయ నమః" అనే అష్టాక్షరి మంత్రం జపించండి

నూతన సంవత్సరం సాయంత్రం శివపూజ

జనవరి 1, 2026 నాడు గురు ప్రదోష వ్రతం రోజున సాయంత్రం ప్రదోష కాలంలో శివుడిని పూజించండి. శివలింగానికి నీటితో, పాలతో అభిషేకం చేయండి. బిల్వపత్రం వేయండి.. నైవేద్యం సమర్పించండి. 'ఓం నమః శివాయ'  మంత్రాన్ని జపించండి.   గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.