Guru Purnima 2025 Celebrations: జూలై 10న దేశవ్యాప్తంగా గురు పూర్ణిమను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున భారత్‌లో జరుపుకుంటారు. మహాభారతంతో పాటు 18 పురాణాల రచయిత అయిన మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడని హిందువులు విశ్వసిస్తారు. అందువల్ల, ఈ రోజును గురువుల ఆరాధనకు అంకితం చేశాం. ఈరోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు.
వేద వ్యాసుడు మొదటి గురువుగా పరిగణిస్తాం. ఈ సందర్భంగా, పతంజలి యోగపీఠ్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు అయిన రామ్‌దేవ్, ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ మార్గదర్శకత్వంలో పతంజలి వెల్నెస్, యోగపీఠ్-2లోని యోగ భవన్ ఆడిటోరియంలో గురు పూర్ణిమ వేడుకను ఘనంగా నిర్వహించారు.
స్వామి రామ్‌దేవ్ ఏమన్నారంటే..
ఈ కార్యక్రమంలో రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ఒకరినొకరు పూలమాలతో సన్మానించుకుని పరస్పరం గౌరవించుకున్నారు. దేశ ప్రజలకు వీరు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామి రామ్‌దేవ్ మాట్లాడుతూ.. గురు పూర్ణిమ అనేది సనాతన ధర్మాన్ని కొనసాగించే పండుగ లాంటిది అన్నారు. ఇది భారతదేశంలో గురు-శిష్యుల గొప్ప సంప్రదాయానికి, శాశ్వత సాంస్కృతిక వారసత్వానికి పరిపూర్ణతను తెచ్చే వేడుక అని పేర్కొన్నారు.
వేదాలు, గురు ధర్మంలోనూ జాతీయ కర్తవ్య సారం ఉందని బాబా రామ్‌దేవ్ తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తోందని, అయితే ఈ ఆధిపత్యం సత్యం, యోగ, ఆధ్యాత్మికత, న్యాయంపై ఆధారపడి ఉంటేనే అందరికీ ప్రయోజనం చేకూరుతుందని రాందేవ్ పేర్కొన్నారు.
గురు పూర్ణిమ ప్రాముఖ్యతపై ఆచార్య బాలకృష్ణ
ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. గురు పూర్ణిమ అనేది గురు-శిష్యుల ప్రాముఖ్యత, మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ అన్నారు. అయితే, ఒకరు పూర్తి నమ్మకంతో తమ గురువు మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ సంప్రదాయానికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. గురు-శిష్యుల వంశపారంపర్యం, యోగ, ఆయుర్వేదం, సనాతన ధర్మం, వేదాల నుంచి లభించిన జ్ఞానం ద్వారా భారతదేశం ప్రపంచానికి పెద్దన్న హోదాను పొందుతుందని ఆయన స్పష్టం చేశారు.
యాత్రికులకు ఆహారం అందిస్తున్న పతంజలి యోగపీఠ్
కన్వర్ యాత్ర కోసం హరిద్వార్‌లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. పవిత్ర జలం కోసం దేశంలోని నలుమూలల నుంచి భక్తులు హరిద్వార్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పతంజలి యోగపీఠ్ ఒక నిరంతర కిచెన్ (అఖండ భండారా) ఏర్పాటు చేసింది. దాంతో భక్తులకు పతంజలి యోగపీఠ్ భోజనం అందించి వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది.