Kodungallur Maa Kali Mandir: దక్షిణ భారతదేశంలో పురాతన దేవతలు, రహస్య దేవాలయాలు కలిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కేరళలో ఉన్న ఓ ఆలయంలో  దేవత తన చేతుల్లో రాక్షసుడి తలను పట్టుకుని ఉంటుంది..ఆమె కాళి అసలు రూపం అని నమ్ముతారు భక్తులు. ఆ ఆలయం గురించి తెలుసుకుందాం

Continues below advertisement

కేరళలోని కొడుంగల్లూర్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఉంది భగవతి అమ్మవారి ఆలయం. మలబార్‌లోని 64 భద్రకాళి ఆలయాలలో ప్రముఖమైనది కొడుంగల్లూర్ . ఈ ఆలయాన్ని శ్రీ కురుంబా భగవతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు భగవతి అమ్మవారిని కురుంబా లేదా కొడుంగల్లూర్ అమ్మ అని పిలుస్తారు. ఈ ఆలయంలో కాళిక రుద్ర రూపాన్ని పూజిస్తారు. 8 చేతులతో కాళికాదేవి ప్రచండ రూపం ధరించి దర్శనమిస్తుంది. ఓ  చేతిలో రాక్షసుడు  మొండెం, ఒక చేతిలో గంట, ఒక చేతిలో కత్తి  ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. 

కొడుంగల్లూర్ ఆలయం చరిత్ర

Continues below advertisement

నమ్మకాల ప్రకారం.. పూర్వం ఈ ఆలయంలో శివుడిని పూజించేవారు. కొంతకాలం తరువాత పరశురాముడు ఆలయానికి సమీపంలో   కాళి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కొడుంగల్లూర్ నగరం ఒకప్పుడు చేర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. మందిరంలో ఉన్న 5 'శ్రీ చక్రాలను' శంకరాచార్యులు ప్రతిష్టించారు, వీటిని దేవత శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఆలయంలో అమ్మవారికి పువ్వులు సమర్పించేది కేవలం పూజారులు మాత్రమే.  పూర్వం ఈ ఆలయంలో పక్షులు , మేకలను బలి ఇచ్చే ఆచారం ఉండేది. కానీ కేరళ ప్రభుత్వం ఆదేశించిన తరువాత ఆలయంలో పశుబలిని పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు ఆలయంలో భగవంతునికి ఎరుపు రంగు ధోతీని సమర్పిస్తారు.

తమిళ భాషలో ఇలంగో అడిగల్ రచించిన "సిలప్పదికారం" మహాకావ్యంలో నాయకి కన్నకి... అమ్మన్ ఈ ఆలయంలో ప్రార్థించి మోక్షం ప్రసాదించిందని చెబుతారు.  ఇక్కడ తాంత్రిక (శాక్తేయ) ఆచారాలు పాటిస్తారు. మొదటి శాక్త పూజను మలబార్ నుంచి వచ్చిన థియ్యర్ వ్యక్తి చేశాడని చెబుతారు

కొడుంగల్లూర్ ఆలయంలో ప్రధాన పండుగలు

కేరళలోని ప్రధాన పండుగలలో భరణి పండుగ కూడా ఒకటి. ఇది ప్రతి సంవత్సరం మార్చి ,  ఏప్రిల్ నెలల మధ్య జరుపుకుంటారు. ఈ పండుగ ప్రధానంగా కోజికల్‌కు మూడల్ అనే ఆచారంతో ప్రారంభమవుతుంది, ఇందులో కోళ్లను బలిస్తారు.  

ముఖ్యమైన వివరాలు

కొడుంగల్లూర్, తృశ్శూర్ జిల్లా, కేరళ (తృశ్శూర్ నుంచి 40 కి.మీ.) 

ఆలయం ఎత్తు 32.53 మీ. (107 అడుగులు) 

సందర్శించేందుకు ఉత్తమ సమయం -  జనవరి-ఏప్రిల్ (భరణి పండుగ సమయంలో) 

నెడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం, ఇరిన్జలకుడ రైల్వే స్టేషన్, కొడుంగల్లూర్ బస్ స్టాండ్ నుంచి దాదాపు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయం గురించి పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్  kodungallursreekurumbabhagavathytemple.org సందర్శించండి గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే ఇవ్వబడింది. ABPLive.com ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!