End Of Kali Yuga: వేదాల ప్రకారం, హిందూ మతంలో 4 యుగాలు ఉన్నాయి, వాటిలో చివ‌రిదైన క‌లియుగంలోనే ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. కలియుగం ముగియడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలుసా? కలియుగం ముగిశాక ఎలాంటి సంఘటనలు జరుగుతాయి..?


1. పురాత‌న‌మైన‌ది హిందూ మతం
హిందూ మతం 90 వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. క్రీ.పూ.9057లో స్వయంభూ మనువు, క్రీ.పూ 6673లో వైవస్వత మనువు హిందూమతంలో మొదటివారు. పౌరాణిక విశ్వాసం ప్రకారం, శ్రీరాముని జననం సా.శ.పూ. 5114, శ్రీ కృష్ణుని జన్మ క్రీ.పూ 3112 అని పేర్కొన్నారు. అదే సమయంలో, ప్రస్తుత పరిశోధనల ప్రకారం, హిందూ మతం 12-15 వేల సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణిస్తున్నారు. ఇది సుమారు 24 వేల సంవత్సరాల నాటిది అని తెలుస్తోంది.


Also Read : కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..


2. నాలుగు యుగాలు
వేదాల ప్రకారం, హిందూ మతంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాల గురించి ప్రస్తావించారు. ఈ సత్యయుగంలో దాదాపు 17 లక్షల 28 వేల సంవత్సరాలు, త్రేతాయుగంలో సుమారు 12 లక్షల 96 వేల సంవత్సరాలు, ద్వాపర యుగంలో 8 లక్షల 64 వేల సంవత్సరాలు, కలియుగంలో దాదాపు 4 లక్షల 32 వేల సంవత్సరాలు ఉన్నాయని చెబుతారు. శ్రీరాముడు త్రేతాయుగంతోనూ, శ్రీకృష్ణుడు ద్వాపరయుగంతోనూ ముడిపడి ప్రస్తుత కలియుగం కొనసాగుతోంది.


3. కలియుగం మొత్తం వ్యవధి
పండితులు చెప్పిన‌ ప్రకారం, కలియుగం 4 లక్షల 32 వేల మానవ సంవత్సరాలుగా విస్తరించి ఉంది, అందులో మనం కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే గడిపాము. కలియుగం ఆధునిక గణనను పరిశీలిస్తే, కలియుగం క్రీస్తు పూర్వం 3,120 లో ఐదు గ్రహాలు అంగారకుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని మేషరాశిలో 0 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు ప్రారంభమైందని చెబుతారు.


దీని ప్రకారం ఇప్పటికి కలియుగం 3102+2023=5125 సంవత్సరాలు మాత్రమే గడిచింది. ఈ విధంగా, కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలలో 5,125 సంవత్సరాలు గడిచినట్లయితే, ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అంటే కలియుగం ముగియడానికి ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత కాలాన్ని కలియుగం మొదటి దశ అంటారు.


4. కలియుగం ఎలా ఉంటుంది
కలియుగంలో మతం అంతరించిపోవడం, దుష్కర్మలు పెరగడం, దుష్టకార్యాలు వంటివి ఎక్కువగా చూస్తుంటాం. ఈ యుగంలో, భూమిపై ఉన్న అన్ని జీవులలో, దేవతలు, రాక్షసులు, యక్షులు లేదా గంధర్వులు కూడా మనిషి కంటే గొప్పవారు కాదు. ఈ యుగంలో మంచి పనులు చేసేవారిని దేవతలుగానూ, చెడు పనులు, పాపాలు చేసేవారిని రాక్షసులుగానూ పరిగణిస్తారు. వేదవ్యాస మహర్షి మహాభారతంలో కలియుగం గురించి ప్రస్తావించారు, ఈ యుగంలో మానవులలో వర్ణ ఆశ్రమ సంబంధిత ధోరణులు ఉండవని, వేదాలను అనుసరించే వారు ఉండర‌ని తెలిపారు. ప్రజలు కూడా వివాహానికి కులం,  గోత్రం, మతాన్ని పరిగణించరు. శిష్యుడు గురువు చెప్పిన మాట విన‌డు. కలియుగంలో కాలం గడుస్తున్న కొద్దీ భయంకరమైన రోజులు వస్తాయి.


5. కలియుగంలో విష్ణువు అవతారం
లోకంలో స్త్రీ ద్వేషం, దుష్ప్రవర్తన, దురాగతాలను అంతం చేయడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు వివిధ అవతారాలు ధ‌రించాడు. అలా ఆయ‌న రూపుదాల్చిన‌వే ద‌శావ‌తారాలుగా గుర్తింపు పొందాయి. అందులోని ప‌ద‌వ, చివ‌రి అవ‌తార‌మే కల్కి అవతారంగా చెబుతారు.


Also Read : కలియుగాంతం ఎప్పుడంటే….! ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలు?


కలియుగంలో పాపభీతి తారస్థాయికి చేరినప్పుడు విష్ణువు కల్కి రూపాన్ని ధ‌రిస్తాడు. కల్కి అవతారంలో ఉన్న విష్ణువు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచ‌మి రోజున సంభాల అనే ప్రదేశంలో, విష్ణుయాశ అనే వ్యక్తి ఇంట్లో జన్మిస్తాడ‌ని చెబుతారు. ఈ అవతారంలో దేవదత్తుడు గుర్రంపై స్వారీ చేసి పాపులను నాశనం చేసి ప్రపంచంలోని భయం, అసహ్యతను మరోసారి అంతం చేస్తాడు. అప్పటి నుంచి స్వర్ణయుగం ప్రారంభ‌మ‌వుతుంది. విష్ణువు కల్కి అవతారం ధరించడానికి ఇంకా వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కానీ విష్ణువు ఇప్పటికే కల్కి రూపంలో పూజలందుకుంటున్నాడు.


కలియుగంలో ధర్మం అధర్మ మార్గం పడుతుందని, మానవులు నరమాంస భక్షకుల్లా ప్రవర్తిస్తారని, శాంతి, సామరస్యం తన ఉనికిని కోల్పోతుందని పేర్కొన్నారు. సృష్టిలోని అధర్మాన్ని రూపుమాపడానికి, ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించ‌డానికి శ్రీ‌మ‌హా విష్ణువు కల్కిగా భూలోకానికి వస్తాడని చెబుతారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.