అన్వేషించండి

Spiritual News: చూపుడు వేలు చూపించి మాట్లాడే అలవాటుందా? మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా?

Spirituality: చాలామందికి చూపుడు వేలు చూపించి మాట్లాడే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మంచిదేనా? చూపుడు వేలు చూపించి మాట్లాడిన వారి స్వభావం ఎలా ఉంటుంది?

Spiritual News: చూపుడువేలు..ఆధిక్యత, ఆజ్ఞాపన, ఆరోపణ భావనకు సూచన. నేను చెప్పేది నువ్వు విని అనే ధోరణి, ఆత్మవిశ్వాసం లేదా నాయకత్వ లక్షణం కూడా. కానీ వేలు చూపించి మాట్లాడే తీరు తరుచుగా ఇతరులపై ఆధిక్యత కోసం, ఎదుటివారిని తప్పు అని చూపించడంలో భాగంగా చెప్పొచ్చు.  

చూపుడు వేలు చూపించి మాట్లాడేవారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే.. వారు తమ అభిప్రాయాలను బలంగా సమర్ధించుకోవాలని, ఇతరులు తమ నియంత్రణలో ఉండాలని, అందరి దృష్టినీ తాము ఆకర్షించాలని కోరుకుంటారు. ఇది అహంకారానికి , రజోగుణానికి సూచన. ఇలాంటి వారిలో సహనం, వినయం తక్కువ. ఇది పూర్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు కానీ ఓ భావనా ప్రకటన.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

పూజలు, జపాలు చేసేటప్పుడు చూపుడు వేలు వినియోగించకూడదు అని చెబుతారు పండితులు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో ముద్రలు, యోగం, తంత్రంలో ప్రతి వేలికి ఓ అర్థం ఉంది. వాటిలో చూపుడు వేలు అహంకారానికి నిదర్శనం.  

చూపుడు వేలు చూపించి మాట్లాడడం అనేది 'నేను' అనే భావనను బలపరుస్తుంది. పూజ, జపం, ధ్యానం సహా ఏ శుభకార్యం అయినా అహాన్ని వదిలి చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అర్థం. అప్పుడే పరమేశ్వరుడిలో ఏకంకాగలరు. ఈ వేలు వాడితే పూజలో నేను అనే భావన వస్తుంది. ఇది భక్తి, సమర్పణకు అడ్డంకిగా మారుతుంది. 

జపం చేసేటప్పుడు కూడా ఆ పూసలను చూపుడువేలుతో తాకరాదు. మధ్యవేలు లేదా ఇతర వేళ్లు వినియోగిస్తారు కానీ చూపుడు వేలు వాడు. ఇది అహంకారానికి సంకేతం కనుక..

నుదుటిన బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా చూపుడు వేలు వినియోగించరు. బొట్టు పెట్టేటప్పుడు, పెట్టుకునేటప్పుడు చూపుడు వేలు బదులుగా మధ్యవేలు వాడతారు. ఎందుకంటే అహంకారం తోడైతే భక్తి కలుషితంగా మారుతుంది. 

పూజలకు వినియోగించకపోయినా కొన్ని సంప్రదాయాల్లో పితృకార్యాలకు చూపుడు వేలు వాడతారు.  

పూజలో నేను-నువ్వు అనే ద్వందాన్ని వదిలి దేవుడిలో ఏకం చేసుకోమనేందుకు సూచనగా చూపుడు వేలు వినియోగిస్తారు. ఇది బాహ్య నియమం మాత్రమే కాదు..అంతర్గత సాధన కూడా. అహంకారం వదిలి భక్తిని పెంచుకునే ఉపాయం. సంప్రదాయాల అనుగుణంగా వేర్వేరు విధాలుగా చెప్పి ఉండొచ్చు...కానీ.. మూలం ఒక్కటే.. చూపుడు వేలు అహంకారానికి సంకేతం. చూపుడు వేలు చూపించి మాట్లాడడం మీ ద్వంద భావనకు సూచన. ఇది చిన్నవిషయమే..కానీ మార్చుకుంటే మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుందని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు.

చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ విజయోత్సవాన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. వాస్తవానికి ఆంజనేయుడు జన్మించింది వైశాఖమాసం బహుళపక్ష దశమి. దీనికి సంబంధించి ఓ శ్లోకం కూడా ఉంది.  ఈ ఏడాది హనుమాన్ జయంతి మే 12 మంగళవారం వచ్చింది. 

 అసలైన హనుమాన్ జయంతి మే నెలలోనే! తేదీ, పూజా విధానంతో పాటూ ఆంజనేయుడి పుట్టుక గురించి పురాణాల్లో ఏముందో తెలుసుకోండి?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Today Rashifal June 12th: ఈ రోజు రాశి ఫలాలు జూన్ 12, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు జూన్ 12, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Purpose Of Life: మనిషి జీవితం ఓ ప్రయాణం అయితే గమ్యస్థానం ఏంటి?
మనిషి జీవితం ఓ ప్రయాణం అయితే గమ్యస్థానం ఏంటి?
Spiritual News: ప్రతిగురువారం ఇవి పాటిస్తే.. ఉద్యోగం, వ్యాపారం, చదువులో మీకు తిరుగుండదు!
ప్రతిగురువారం ఇవి పాటిస్తే.. ఉద్యోగం, వ్యాపారం, చదువులో మీకు తిరుగుండదు!
Astro Tips: ఏ రోజు తలస్నానం చేయకూడదు? జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య నియమాలు, నమ్మకాలు తెలుసుకోండి !
ఏ రోజు తలస్నానం చేయకూడదు? జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య నియమాలు, నమ్మకాలు తెలుసుకోండి !
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Rohit Sharma, Virat Kohli: రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. టీమిండియా సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
Embed widget