ధనత్రయోదశి 2026: దీపావళి పండుగ సమీపిస్తోంది. ధన త్రయోదశి నుంచి ఈ సందడి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ధన త్రయోదశి నవంబర్ 6 శుక్రవారం వచ్చింది. ఐదు రోజుల దీపావళి పండుగ ధన త్రయోదశితోనే మమొదలు. ఈ రోజు బంగారం, వెండి, కొత్త పాత్రలు , విలువైన వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. అందువల్ల, ఈ రోజున బులియన్ మార్కెట్‌లో భారీ జనసమూహం కనిపిస్తుంది. అయితే బంగారం, వెండి కొనడానికి సరైన శుభ సమయం ఏది? లక్ష్మీ-కుబేర పూజకు సమయం ఏది? ఆ ముఖ్యమైన సమయాలను తెలుసుకుందాం...

Continues below advertisement

దీపావళి లక్ష్మీ పాదాలు: ఇంట్లోకి సంపద రావాలంటే ఏ దిశలో, ఎక్కడ వేయాలి?

ధన త్రయోదశి ఎప్పుడు?  పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు ధంతేరస్ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం, త్రయోదశి తిథి నవంబర్ 6, 2026న ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై, నవంబర్ 7న ఉదయం 10:32 గంటలకు ముగుస్తుంది. ప్రదోషకాలంలో పూజల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ధంతేరస్‌ను నవంబర్ 6న జరుపుకుంటున్నారు. బంగారం  వెండి కొనడానికి శుభ సమయం?

స్థానిక పంచాంగ గణనల ప్రకారం, నవంబర్ 6వ తేదీన బంగారం కొనడానికి ఈ క్రింది శుభప్రదమైన చౌఘడియా సమయాలున్నాయి. ఈ సమయాల్లో బంగారం, వెండి లేదా కొత్త విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. పంచాంగ.. స్థానిక గణనల మధ్య కొన్ని నిమిషాల వ్యత్యాసం ఉండవచ్చు.

Continues below advertisement

ధంతేరస్ 2026: ఈ 8 చోట్ల దీపాలు వెలిగిస్తే సంపద, శ్రేయస్సు ఖాయం!

బంగారం, వెండి కొనడానికి శుభ సమయం  

త్రయోదశి తిథి ప్రారంభం - ఉదయం 10.59

మధ్యాహ్నం 1.47 నుంచి 3.24 వరకు వర్జ్యం ఉంది

ఉదయం 8.21 నుంచి 9.06 వరకు తిరిగి మధ్యాహ్నం 12.09 నుంచి 12.55 వరకు దుర్ముహూర్తం ఉంది

ఉదయం 11 దాటిన తర్వాత వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయంలో బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయొచ్చు

లక్ష్మీ-కుబేర పూజకు శుభ సమయం

మత విశ్వాసాల ప్రకారం, ధంతేరస్ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు , ధన్వంతరి దేవుడిని పూజించే సంప్రదాయం ఉంది. ప్రదోషకాలంలో లక్ష్మీపూజ శుభాన్నిస్తుందని నమ్మకం.  

రామ ఏకాదశి, గోవత్స ద్వాదశి 2026 నవంబర్ 5నే: ఎలా సాధ్యం?

ధనత్రయోదశి రోజు బంగారం, వెండి కొనడం వల్ల కలిగే ప్రాముఖ్యత ఏంటి?

పౌరాణిక విశ్వాసాల ప్రకారం సముద్ర మథనం నుంచి లక్ష్మీదేవి , ధన్వంతరి దేవుడు ఉద్భవించారు. ధన్వంతరి దేవుని చేతిలో అమృత కలశం ఉండేది. అందుకే, ఈ రోజున కొత్త పాత్రలు , లోహ వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయం ప్రారంభమైందని నమ్ముతారు. ధనత్రయోదశి నాడు బంగారం, వెండి కొనడం అనేది ఇంట్లోకి లక్ష్మీదేవి రాకకు ..శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ రోజు వెండి నాణేలు, లక్ష్మీ-గణేశ విగ్రహాలు, బంగారు ఆభరణాలు .. కొత్త పాత్రలు కొనడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. చాలా కుటుంబాలలో, కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీ పూజ సమయంలో పూజిస్తారు కూడా.

బంగారం, వెండి కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి?

ధనత్రయోదశి రోజు సందర్భంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఆభరణాలపై ఉన్న BIS హాల్‌మార్క్, స్వచ్ఛత వివరాలు , HUID నంబర్‌ను తప్పకుండా తనిఖీ చేయాలి. 

వెండి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు కూడా, వాటి స్వచ్ఛతను నిర్ధారించుకోవాలి. అధికారిక కొనుగోలు పత్రాన్ని పొందండి , తయారీ ఛార్జీల గురించి తెలుసుకోండి.మీ నగరం  స్థానిక క్యాలెండర్ ప్రకారం సరైన సమయాన్ని ఎంచుకోండి.

దీపావళి 2026: 5 రోజుల పండుగ.. ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత, విశిష్టత!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు, అభిప్రాయాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏ నమ్మకాలను లేదా సమాచారాన్ని ఆమోదించదని గమనించడం ముఖ్యం . ఏదైనా సమాచారం లేదా అభిప్రాయంపై చర్య తీసుకునే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.