Chanakya Niti: మన జీవితాల ఎదుగుదల, పతనం కేవ‌లం మ‌న మీదే ఆధార‌ప‌డి ఉండ‌దు. మనతో ఉన్న వ్యక్తులు మ‌న‌ల్ని ప్రభావితం చేస్తార‌ని ఆచార్య‌ చాణక్యుడు చెప్పాడు. ఈ ముగ్గురు మనతో ఉంటే అదృష్టం మన వెంటే ఉంటుందని తెలిపాడు. మ‌రి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు..? వారు మీతో ఉన్నారా?


సమస్య లేదా క‌ష్టం ఎదురైనప్పుడు భయపడని వ్యక్తి, తన జీవితంలో ఏదో ఒక రోజు విజయం సాధిస్తాడు. మీరు గెలిచినా ఓడినా మీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది, మీరు దానిని అంగీకరిస్తే నష్టమే కానీ, ఆ పరిస్థితిని మీరు నిర్ణయించుకుంటే అది మీకు విజయం.


జీవితంలో మంచి రోజులతో పాటు కష్టకాలం కూడా వస్తుంది, అయితే ఈ కష్టాలను సులభంగా ఎదుర్కొనేవాడే నిజమైన యోధుడు. చాణక్యుడు ముగ్గురు వ్యక్తుల సహవాసాన్ని జీవితంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించాడు. ఈ ముగ్గురితో ఉన్న వ్యక్తి తనకు వచ్చిన ప్రతి సంక్షోభాన్ని హాయిగా ఎదుర్కొంటాడు. కష్టకాలంలో అలాంటి ముగ్గురు వ్య‌క్తులు మీతో ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ మిమ్మ‌ల్ని ఓడించలేదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు.


"సంసారత్పాదగ్ధానం త్రయో శబాణహేతవః".
అపత్యం చ కలత్రం చ సతతం సదారేవ చ||''


1. తెలివైన జీవిత భాగస్వామి
సుఖ దుఃఖాలలో ఒకరికొకరు తోడునీడగా నిలిచే భార్యాభర్తలు ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. కష్ట సమయాల్లో, మనతో న‌డిచే జీవిత‌ భాగస్వామిని కలిగి ఉండటం అదృష్టంగా పని చేస్తుంది. సంస్కారవంతులైన, అవగాహన ఉన్న భాగస్వామి సహాయంతో, ఎవరైనా ఖచ్చితంగా విజయాల మెట్లు ఎక్కగలరని ఆచార్య చాణక్య చెప్పాడు.


2. మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు
పిల్లలు తల్లిదండ్రులకు మద్దతు ఇస్తారు. సత్ప్రవర్తన కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోవ‌డాన్ని అంగీక‌రించ‌లేరు. తల్లితండ్రుల ప్రతి చిన్న, పెద్ద స‌మ‌స్య తమదిగా భావిస్తారు. తల్లితండ్రులు ఆపదలో ఉన్నప్పుడు వారిని కించపరచకుండా చూసే పిల్లలు వారి తల్లిదండ్రులకు ఎప్పుడూ అదృష్టమే.


3.మంచి స్నేహితులు
ఒక వ్యక్తి ప్రవర్తన, స్నేహం అతని విజయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి వ్యక్తులతో మన సాంగత్యం అడుగడుగునా ఆకాశమంత ఎత్తుకు చేరేలా స్ఫూర్తినిస్తుంటే, చెడ్డవారి సాంగత్యం మీ మేధస్సును మందగింపజేసి మిమ్మల్ని వినాశనపు అంచులకు చేర్చుతుంది. పెద్దమనుషుల సాంగత్యం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది, కుటుంబంలో శ్రేయస్సును పెంచుతుంది.


Also Read : చాణక్య నీతి: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!


సత్ప్రవర్తన గల భార్య, సత్ప్రవర్తన కలిగిన పిల్లలు, కష్టకాలంలో తనకు అండగా నిలిచే స్నేహితులను పొందిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని ఆచార్య చాణక్యుడు తెలిపాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.