అప్పు ఒక శాపం వంటిదని చాణక్యుడు చెప్పాడు. ఇది మనశ్శాంతిని, గౌరవాన్ని హరిస్తుంది. కాబట్టి, తీసుకున్న రుణాన్ని వీలైనంత త్వరగా తిరిగి చెల్లించి రుణవిముక్తులు కావాలి.
చాణక్య నీతి: అప్పుతో సహా జీవితంలో వదిలించుకోవాల్సిన 4 విషయాలు!
Canakya Niti In Telugu: చాణక్య నీతి ప్రకారం, అప్పుతో పాటు ఈ నాలుగు విషయాలను కూడా సకాలంలో వదిలించుకోవాలి..లేదంటే అవి మీకు చెడు చేస్తాయి

- అప్పును త్వరగా తిరిగి చెల్లించి, రుణ విముక్తి పొందాలి.
- అగ్ని శక్తిని తక్కువ అంచనా వేయరాదు, పూర్తి నివారణ ముఖ్యం.
- బలహీనుడిగా కనిపించిన శత్రువును నిర్లక్ష్యం చేయరాదు, పరిష్కరించుకోండి.
- అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా చికిత్స తీసుకోవాలి.
చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో కేవలం ఆర్థిక, రాజనీతి శాస్త్రాలపై తన ఆలోచనలను మాత్రమే అందించలేదు, జీవితంలోని ప్రతి చిన్న, పెద్ద అంశాన్ని కూడా స్పృశించారు. చాణక్యుడు బోధించిన విషయాల్లో.... ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదని, సరైన సమయంలో నిర్మూలించాలని చెప్పిన విషయాల గురించి మీకు స్పష్టంగా చెప్పబోతున్నాం.
చాణక్య నీతి: జీవితంలో ఈ ముగ్గురిని ఒప్పించొద్దు! మీ సమయం వృధా.
అప్పులు
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి రుణం తీసుకుంటే దానిని సకాలంలో తిరిగి చెల్లించాలి. అప్పు ఒక శాపమని, అది ఒక వ్యక్తి మనశ్శాంతి, నిద్ర , గౌరవాన్ని హరించివేస్తుందని ఆచార్య చాణక్యుడు అంటారు. అందువల్ల, రుణాన్ని తిరిగి చెల్లించి, వీలైనంత త్వరగా రుణ విముక్తులు కావడానికి కష్టపడాలి. రుణం చెల్లించే పరిస్థితిలేనప్పుడు అప్పు తీసుకునేందుకు కూడా ఆలోచించాలని సూచించారు చాణక్యుడు
అగ్ని
ఆచార్య చాణక్యుని ప్రకారం, ఒక చిన్న నిప్పురవ్వకు కూడా క్షణంలో ఒక పెద్ద అడవిని కాల్చివేసే శక్తి ఉంది. అందువల్ల, అగ్ని శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళకూడదు. అగ్ని విషయంలో అజాగ్రత్త చాలా నష్టదాయకం కావచ్చు. చిన్న నిర్లక్ష్యం కూడా పూర్తిగా దహించివేస్తుంది.
చాణక్య నీతి: ఇగ్నోర్ చేయడం అవసరం కాదు ఆయుధం.. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఇగ్నోర్ చేయాలో తెలుసుకోండి!
శత్రువు
ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం శత్రువు శక్తిహీనుడిగా, నిస్సహాయుడిగా కనిపించినప్పటికీ తనని బలహీనుడిగా భావించే పొరపాటు ఎన్నడూ చేయకూడదు. అవకాశం దొరికితే, శత్రువు మీపై తీవ్రంగా దాడి చేసి మీకు హాని కలిగించగలడు. అందువల్ల, మీకు ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే, దానిని తెలివిగా , సకాలంలో పరిష్కరించుకోవాలి. శత్రువుతో రాజీపడటం ద్వారా గానీ, తనని ఓడించడం ద్వారా గానీ, మనం వారికి శాశ్వతంగా దూరంగా ఉండాలి. అయినప్పటికీ అప్రమత్తంగానే వ్యవహహించాలి
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
అనారోగ్యం
చాణక్య నీతి ప్రకారం.. ఆరోగ్యం కంటే గొప్ప సంపద మరొకటి లేదు. అందువల్ల, మనం ఎల్లప్పుడూ మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా, అనారోగ్యం చిన్నదైనా, పెద్దదైనా, దానికి పూర్తిగా చికిత్స చేయించుకోవాలి. మీరు దానిని తక్కువ అంచనా వేసే పొరపాటు చేస్తే, అప్పుడు చిన్న అనారోగ్యం కూడా మిమ్మల్ని నాశనం చేయగల తీవ్రమైన వ్యాధిగా మారవచ్చు.
వివాహం, బంధాలు, రాజనీతి, విద్య సంపద ప్రాముఖ్యత, స్నేహాలు సహా జీవితంలో ఉన్నతి కోసం వివిధ అంశాలపై చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్న విషయాలు గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి...
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు, అభిప్రాయాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏ నమ్మకాలను లేదా సమాచారాన్ని ఆమోదించదని గమనించడం ముఖ్యం . ఏదైనా సమాచారం లేదా అభిప్రాయంపై చర్య తీసుకునే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి
Frequently Asked Questions
చాణక్య నీతి ప్రకారం అప్పుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అగ్ని ప్రమాదాల విషయంలో చాణక్యుడు ఇచ్చిన సలహా ఏమిటి?
చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద అడవిని కాల్చే శక్తిని కలిగి ఉంటుంది. అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు, మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు ఆ ప్రదేశాన్ని వదలకూడదు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు.
శత్రువుల పట్ల చాణక్యుడు ఎలాంటి వైఖరిని సూచించాడు?
శత్రువు బలహీనుడిగా కనిపించినప్పటికీ, అతడిని తక్కువ అంచనా వేయవద్దు. అవకాశం దొరికితే వారు హాని కలిగించగలరు. శత్రుత్వాలను తెలివిగా, సకాలంలో పరిష్కరించుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి.
చాణక్య నీతి ప్రకారం అనారోగ్యం గురించి మనం ఏమి చేయాలి?
ఆరోగ్యం గొప్ప సంపద, కాబట్టి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా అనారోగ్యానికి పూర్తిగా చికిత్స చేయించుకోవాలి. తక్కువ అంచనా వేస్తే అది తీవ్రమైన వ్యాధిగా మారవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























