మిమ్మల్ని మీరు పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..
ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ మాటలో చాలా లోతైన అర్థం, ఆంతర్యం ఉంది. నిజమైన విలువ, గౌరవం, ప్రతిష్ఠ అనేవి మాటలతో కాదు, ప్రవర్తనతో నిరూపించుకోవాలి. మీరు ఎప్పుడూ ఇతరులకు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. విజయవంతమైన జీవితానికి, అలాగే పని ప్రదేశంలో గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ముఖ్యమైన పాఠాలను బోధిస్తుంది. ఇందుకోసం కింది 7 సూత్రాలు పాటిస్తే మీ విలువ మీకు తెలిసిపోతుంది, ఇతరులు కూడా గుర్తిస్తారు.
ప్రస్తుత పోటీ యుగంలో, ప్రతి ఒక్కరూ పని ప్రదేశంలో గౌరవం, గుర్తింపు పొందాలని కోరుకుంటారు. అయితే, దాని కోసం మిమ్మల్ని మీరు పదేపదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య చాణక్యుని నీతిబోధలు, పని ప్రదేశంలో గౌరవం, మర్యాద సాధించడంతో పాటు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యమైన పాఠాలను బోధించాయి.
చాణక్య నీతి: వివేకం ఉన్నవాళ్లు ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉంటారు!
మౌనం శక్తిని గుర్తించండి
ప్రతిదానికీ ప్రతిస్పందించడం కంటే సరైన సమయంలో మాట్లాడటం ముఖ్యం. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం వ్యక్తిత్వ ప్రభావాన్ని పెంచుతుంది. మీ జ్ఞానాన్ని ప్రదర్శించడం మానుకోండి
మీ నైపుణ్యాలను నిరంతరం ప్రదర్శించే ఆలోచన నుంచి బయటపడండి. సరైన సమయంలో మీ పని ద్వారా మీ సామర్థ్యాలను నిరూపించుకోండి. ఎవరి ముందో మీ జ్ఞానాన్ని ప్రదర్శించకుండా ఫలితాన్ని సాధించి చూపించండి వినయం పాటించండి
గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అంటారు కదా పెద్దలు..చాణక్య నీతిలోనూ ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతరులను గౌరవించే వ్యక్తి సమాజంలోనూ, పని చేసే చోట కూడా గౌరవాన్ని పొందుతాడు. నిజాయితీగా ఉండండి సమయపాలన, బాధ్యత నిజాయితీ మీ సహోద్యోగుల నమ్మకాన్ని పొందడానికి మీకు సహాయపడతాయి. మీరు క్రమశిక్షణతో వ్యవహరించి పనిని సరైన సమయంలో పూర్తిచేసినప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు మీకు గౌరవం దానంతట అదే వస్తుంది ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి
ఆఫీసు వాతావరణాన్ని అర్థం చేసుకోండి కానీ అనవసరమైన వాదనలకు, వర్గపోరాటాలకు దూరంగా ఉండండి. ప్రతి కార్యాలయంలోనూ వర్గాలుంటాయి, గ్రూపు రాజకీయాలంటాయి. కానీ మీ పనిపై మీరు శ్రద్ధపెట్టండి.. ఆ రాజకీయాలకు, వర్గపోరాటాలకు దూరంగా వ్యవహరించండి. అందరితో సమానంగా వ్యవహరించండి..గౌరవాన్ని మీరు అడగాల్సిన అవసరం లేదు అదే వస్తుంది.
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి! వినడాన్ని అలవాటు చేసుకోండి
మాట్లాడడమే కాదు వినడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల ఆలోచనలను శ్రద్ధగా వినడం సంబంధాలను మెరుగుపరుస్తుంది , మీ వ్యక్తిత్వాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఇతరులకు గుర్తింపు ఇవ్వండి
మీ సహోద్యోగుల పనిని అభినందించండి. ఇతరుల కృషిని గౌరవించే వ్యక్తి గొప్ప నాయకుడు అవుతారని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు
