Budha Gochar 2022 : జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేక ఉంటుంది. ఆయా గ్రహాలు రాశులు మారినప్పుడల్లా ఆ ప్రభావం పన్నెండు రాశులపైనా పడుతుంది. కొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇంకొన్ని రాశులపై మిశ్రమ ప్రభావం ఉంటుంది. జ్ఞానం,ఆత్మవిశ్వాసం, మేధస్సు, తార్కికానికి ప్రతీక అయిన బుధగ్రహం ఆగస్టు 21 ఆదివారం అర్థరాత్రి కన్యారాశిలోకి ప్రవేశించింది. ఈ ప్రభావం ఏ రాశులపై ఎలా ఉందో చూద్దాం...
మేషం
కన్యా రాశిలో బుధుడి సంచారం అంటే మేష రాశినుంచి ఆరో పాదంలో ఉన్నాడు. ఈ సమయంలో ఓవర్ గా ఆలోచించడం మానుకోవాలి..లేకుంటే మానసిక సమస్యలు ఎదురవుతాయి. అత్తమామలతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే మీ జీవిత భాగస్వామితో వివాదం వచ్చే అవకాశం ఉంది. కన్యారాశిలో బుధుడు సంచరించే నెలరోజులూ ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభం
కన్యారాశిలో బుధుడి సంచారం వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ఆస్తి కలిసొస్తుంది.
మిథునం
కన్యారాశిలో బుధగ్రహ సంచారం మీ కుటంబ జీవితాన్ని సుఖంగా ఉండేలా చేస్తుంది.ఈ రాశివారు తమ కుటుంబంతో మంచి బంధాలు పెంపొందించగలుగుతారు. కార్యాలయంలో మీపై అటెన్షన్ ఉండేలా చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. మీ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం
బుధగ్రహ సంచారం కర్కాటక రాశివారికి బాగానే ఉంటుంది. మీకు స్నేహితులు, సోదరలు నుంచి సహకారం అందుతుంది. జర్నలిజం, రచన, కన్సల్టింగ్, నటన, దర్శకత్వం లేదా యాంకరింగ్ వంటి కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేవారికి శుభసమయంగా చెప్పొచ్చు. వినూత్నంగా ఆలోచించి అడుగేస్తే సక్సెస్ అవుతారు. వ్యాపారులకు కలిసొచ్చే సమయం ఇది. మాటతీరు మార్చుకోకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
Also Read: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం
సింహం
కన్యారాశిలో బుధుడి సంచారం సింహరాశివారిని వారి వారి రంగాల్లో రాజుగా నిలబెడుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారు బాగా సక్సెస్ అవుతారు. మీ రాశినుంచి రెండో రాశిలో బుధుడు సంచరిస్తున్నందున సంపద పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. లాయర్లు, మార్కెటింగ్ కార్మికులు , ఉపాధ్యాయులకు అనుకూల సమయం. మీలో ధైర్యం పెరుగుతుంది.
కన్య
బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో సంచరిస్తున్నందున ఈ రాశివారికి కూడా అంతా శుభసమయమే. వ్యాపారులకు పెట్టుబడులు కలిసొస్తాయి..చేసే వ్యాపారంలో భారీ లాభాలొస్తాయి. ముఖ్యంగా డేటా సైంటిస్ట్, ఎగుమతి-దిగుమతి, బ్యాంకింగ్, మెడిసిన్ కు సంబంధించిన వ్యాపారం చేసిన వారు కచ్చితంగా విజయం సాధిస్తారు.
తుల
మీ రాశినుంచి బధుడు 12 వస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీరు జరిపే లావాదేవీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విశ్వసనీయ వ్యక్తులను మీతో ఉంచుకోవడం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే హానితప్పదు. విదేశీ కంపెనీల్లో పనిచేసే వ్యక్తులు ఈ కాలంలో తమ ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.
Also Read: ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆగస్టు 22 నుంచి 28 వరకూ ఈ వారం రాశిఫలాలు
వృశ్చికం
ఈ రాశివారికి బుధుడు పదకొండవఇంట సంచరిస్తున్నందున మీకు అద్భుతంగా ఉంటుంది.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. జీవితభాగస్వామితో సంతోషంగా ఉంటారు.
ధనుస్సు
బుధుడి సంచారం ధనస్సు రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాశినుంచి పదవఇంట బుధుడి సంచారం వ్యాపారం, ఉద్యోగంలో సక్సెస్ అని అందిస్తుంది. ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టొచ్చు..ఉద్యోగులు ఉన్నత ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి. వ్యాపారంలో కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడం ద్వారా మంచి లాభాలు పొందుతారు.
మకరం
తొమ్మిదో స్థానంలో బధుడి సంచారం మీకు మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు వ్యాపారంలో సక్సెస్ అవుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు..
కుంభం
మీ రాశి నుంచి 8వ పాదంలో సంచరిస్తున్నాడు బుధుడు. అందుకే మీ ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ అవసరం. చర్మ సమస్యలు ఉండొచ్చు . అలెర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా ధ్యానంపై శ్రద్ధ పెట్టాలి.
మీనం
కన్యా రాశిలో బుధుడి ఆగమనం మీకు ఫలవంతంగా ఉంటుంది. మీకు ఏడో స్థానంలో బుధుడి సంచారం ఉంటోంది.ఫలితంగా భాగస్వామ్య వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఎక్కువగా వాదించే లక్షణాన్ని మార్చుకుంటే మంచిది. మీ భాగస్వామిపై అనుమానం ఉంటుంది.