Black Magic on Food: తంత్ర సాధన , బ్లాక్ మ్యాజిక్ ప్రయోగంలో ఆహారం పాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీని ఆధారంగా చెప్పాలంటే ఆహారం శరీరాన్ని శక్తివంతం చేసే సాధనం మాత్రమే కాదు.. దీని ద్వారా వ్యక్తి ప్రతికూల, సానుకూల శక్తిని కూడా నియంత్రించవచ్చంటారు. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ క్రియల సమయంలో ఆహారం ద్వారా ఓ వ్యక్తి మానసిక , శారీరక స్థితి, ప్రవర్తన ప్రభావితమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రస్తావించి ఉంటుంది ( ఎలాంటి భోజనం తినకూడదు - దీని గురించి పురాణాల్లో ఏముందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
వశీకరణ , బ్లాక్ మ్యాజిక్ కు సంబంధించి ముఖ్యమైన విషయాలు తంత్ర విద్యలో బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ద్వారా ఓ వ్యక్తికి రహస్యంగా హాని చేస్తారు. ఈ నష్టం కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఆహారాన్ని మంత్రించి తినిపించడం వల్ల మీ శరీరంలో ఊహకందని, ఎలాంటి మెడికల్ రిపోర్టులలో దొరకని మార్పులు వస్తాయి. ఆహారం ద్వారా చేసే ఈ తాంత్రిక క్రియ..ఆ వ్యక్తి భావోద్వేగాలు, ఆలోచనలు, నిర్ణయాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఓ బొమ్మలా మార్చేస్తుంది. ఇది రోజు రోజుకీ మార్పుచెందుతూ పూర్తిగా వారి స్వేచ్ఛను కోల్పోయేలా చేస్తుంది. ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే?
ఆకలి వేయదుతిన్నది అరగదుతొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుందిపనిపై కన్నా నిద్రపై ఫోకస్ పెరుగుతుందితొందరగా ఆవేశం వచ్చేస్తుంటుంది
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
పరిచయం లేనివారు, మీకు హానిచేస్తారనిపించే వ్యక్తులు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించకూడదు. నిత్యం భగవంతుడి ఆరాధనను భక్తిశ్రద్ధలతో చేసేవారికి ఈ విషయం ముందుగానే అవగతం అవుతుంది. ఇలాంటి వ్యక్తులకు ఆ భోజనం చేసే సమయంలో ఏదో గందరగోళంగా అనిపిస్తుంది. వెంటనే మీ కుడి చేతిని ఆజ్ఞా చక్రం (కనుబొమ్మల మధ్య) మీద ఉంచండి. మనస్సులో ఓం దుర్గాయై నమః , ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః మంత్రాన్ని జపించండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఏదైనా చెడు మీ శరీరంలోకి ప్రవేశించే ముందే నాశనం చేస్తుంది. మీ వంటగది లేదా భోజనం చేసే ప్రదేసంలో దుర్గా, హనుమాన్ , బగలాముఖి వంటి రక్షణ యంత్రాలను పెడితే ఇలాంటి ప్రతికూల శక్తి దరిచేదని కొందరు పండితులు చెబుతారు.
శాస్త్రాలు - వేదాల‌్లో రుజువైంది
| అథర్వణవేదం- ఇందులో మంత్రాల ద్వారా ఆహారాన్ని ప్రతికూలంగా మార్చవచ్చు. అందుకే ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి మాత్రమే తీసుకోవాలని చెబుతారు. |
| భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 7-10 లో ఆహారాన్ని మూడు వేర్వేరు వర్గాలుగా విభజించారు. వీటిలో (సాత్విక, రాజసిక , తామసిక) ఆహారం ఉన్నాయి. సాత్విక ఆహారం మనస్సును శాంతింపజేస్తుంది, తామసిక ఆహారం ప్రతికూలత , గందరగోళాన్ని పెంచుతుంది. |
| గరుడ పురాణం ప్రకారం తెలియని వ్యక్తుల నుంచి, మనకు హానిచేస్తారనిపించే వ్యక్తుల నుంచి ఆహారాన్ని తీసుకోకూడదని ఉంది. ఎందుకంటే అలా చేయడం వల్ల మీపై ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుంది. |
| మనుస్మృతి ప్రకారం ఆహారం స్వచ్ఛత , పవిత్రతను కాపాడాలని ఉంది |
| తాంత్రిక గ్రంథం ప్రకారం, మంత్రించిన ఆహారం ద్వారా ఏ వ్యక్తిపైనైనా బ్లాక్ మ్యాజిక్ లేదా వశీకరణ చేయవచ్చని ఉంది |
మీకు ఎప్పుడైనా చెడు శక్తి సోకిందేమో అనిపిస్తే.. పసుపు ఉప్పు నీటితో ముఖాన్ని కడుక్కోండి. దీంతో పాటు ఇల్లంతా ధూపం వేసి దుర్గాయై నమః మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. ఇలాంటి చర్యల ద్వారా మీకు తెలియకుండానే మరబొమ్మలా మారిన మీరు మళ్లీ సాధారణ శక్తి పొందుతారని చెబుతారు. ఎందుకంటే మీపై ఉండే ఈ ప్రతికూల ప్రభావం బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.