అన్వేషించండి

Bhanu Saptami 2026: ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మార్గం! ఈ ఆదివారం సప్తమి తిథి విశిష్టత, పూజా విధానం తెలుసుకోండి!

Bhanu Saptami Puja Vidhanam : ఫిబ్రవరి 08న వచ్చే మాఘమాస ఆదివారం రోజు సప్తమి తిథి రావడంతో 'భానుసప్తమి' అంటారు.. ఈ రోజు పూజ ఎలా చేయాలి? ఫలితం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి

Significance of Bhanu Saptami

సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆదివారం, సప్తమి తిథి..ఈ రెండూ ఒకేరోజు వస్తే ఆ రోజు మరింత విశిష్టమైనది అని చెబుతారు పండితులు

సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానాదికాలు పూర్తిచేయకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం అనారోగ్యానికి, దారిద్ర్యానికి హేతువు. ఈ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడు సూర్యాష్టకంలో చెబుతాడు
 
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

దీని అర్థం ఏంటంటే...

తినకూడని పదార్ధాలైన మద్య మంసాలు తీసుకునేవారు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు. ఆజన్మాంతం దరిద్రం వెంటాడుతుంది. నిషిద్ధ సమయంలో స్త్రీ సమాగమము, నూనె రాసుకోవడం, మంసాన్ని విడిచిపెట్టినవారికి శోకం, వ్యాధి ఉండదు..వారు సరాసరి సూర్యలోకానికి చేరుకుంటారు
 
ఈ నియమాలు కేవలం భానుసప్తమి రోజు మాత్రే కాదు.. ప్రతి ఆదివారం పాటించమని పరమేశ్వరుడు సూర్యాష్టకంలో చెప్పాడు.  

శ్రీ రామచంద్రుడంతటి వ్యక్తి రావణుడిపై గెలుపుకోసం సూర్యభగవానుడిని ఆరాధించాడు. ఎవరైతే ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటి విజయం కలుగుతుంది
 
ఇక భానుసప్తమి విశిష్టత, పూజా విధానం తెలుసుకుందాం!

ఆదివారం సప్తమి తిథి కలిసివచ్చినప్పుడు భానుసప్తమి అవుతుంది. దీనిని విజయ సప్తమి, కల్యాణ సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు సూర్యారాధన చేయడం వల్ల సాధారణ ఆదివారాల కన్నా రెట్టింపు ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయ్. 

ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడికి ఈరోజు..అర్ఘ్యం సమర్పించి, జపం, దానం, దీపారాధన చేయాలి.  ఈ నిమయాలు పాటించడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంపదలు, ఉద్యోగంలో ప్రమోషన్, రాజకీయాల్లో పదవులు, దీర్ఘవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. 
 
భానుసప్తమి రోజు సూర్యుడిని పూజిస్తే..కుజదోషం, పితృదోషం కూడా తొలగిపోతుంది. ఈ రోజు నిర్వహించే హోమం అనంతకోటి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం
 
ఫిబ్రవరి 8 ఆదివారం రోజు సప్తమి తిథి సూర్యోదయం సమయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉంది.  కాబట్టి సూర్యభగవానుడి పూజ ఎప్పుడు చేయాలని అనే సందేహం అవసరం లేదు

సూర్యభగవానుడి పూజ చేసేవారు అభ్యంగన స్నానం చేయరాదు..సాధారణ తలస్నానం చేయొచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి.  తూర్పు దిక్కున తిరిగి కూర్చుని పూజ చేయాలి

భానుసప్తమి పూజా విధానం
 
సూర్యోదయ సమయంలో పసుపు కలిపిన నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి
 
ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి
 
ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః అనే మంత్రం కానీ..సూర్య గాయత్రి, ఆదిత్యహృదయ స్తోత్రం పఠించాలి
 
నేతిలో దీపం వెలిగించాలి..

దానం ఇవ్వాలి అనుకుంటే గోధుమలు, బియ్యం, పసుపు కుంకుమ, ఎరుపు బట్టలు, గంధం, ఫలాలు దానం చేయడం శుభం.

రోజంతా ఉపవాసం ఉండేవారు ఉండొచ్చు లేదంటే ఒకపూట భోజనం చేయొచ్చు
 
భాను సప్తమి రోజు 12సార్లు సూర్యనమస్కారాలు చేయడం ఫలవంతం
  
ఈ పూజను అత్యంత సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు..

సూర్యభగవానుడి అనుగ్రహంతో మీకు ఆరోగ్యం, విజయం, సంపద కలగాలని కోరుకుంటూ

భానుసప్తమి శుభాకాంక్షలు

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ugadi 2026: ఉగాది నుంచి పరాభవ నామ సంవత్సరం! అంటే ఇక పరాభవాలేనా , ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు?
2026 ఉగాది నుంచి పరాభవ నామ సంవత్సరం! అంటే ఇక పరాభవాలేనా , ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు?
Malavya Rajyoga 2026: మీనంలో శుక్ర సంచారం.. ఈ రాశులకు ధనం, సుఖం.. మీ రాశి ఉందా?
మీనంలో శుక్ర సంచారం.. ఈ రాశులకు ధనం, సుఖం.. మీ రాశి ఉందా?
2026 మార్చి 04 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 04 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget