Uttarayan Dakshinayan Death: భగవద్గీతలో శ్రీృష్ణుడు అర్జునుడికి రెండు మార్గాలు వివరించాడు

Continues below advertisement

1. శుక్లగతి ( కాంతి మార్గం)

2. కృష్ణగతి ( అంధకారమార్గం)

Continues below advertisement

ఈ రెండూ ఉత్తరాయణం, దక్షిణాయనంతో అనుసంధానించి ఉంటాయి

ఉత్తరాయణ కాలం - సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే ఆరు నెలల ( మకర సంక్రాంతి నుంచి దాదాపు జూన్ వరకు) కాలంలో మరణించిన యోగులు, బ్రహ్మవేత్తలు...అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపంక్షం ద్వారా బ్రహ్మను చేరుకుంటారు..ఇక వారికి పునర్జన్మ ఉండదు

దక్షిణానయ కాలం - సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే ఆరు నెలల కాలం ( కర్కాటక సంక్రాంతి నుంచి డిసెంబర్ వరకు) ధూమం, రాత్రి, కృష్ణపక్షం ద్వారా చంద్రలోకి చేరి పుణ్యఫలాలు అనుభవించి తిరిగి భూమ్మీద జన్మిస్తారు. 

భగవద్గీతలో 8వ అధ్యాయం 23 -26 శ్లోకాలు, అర్థం ఇదిగో..

శ్లోకం 23యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినఃప్రయాతా యాన్తి తం కాలం వృక్ష్యామి భరతవర్షభ ఓ భరత శ్రేష్టా..యోగులు ఏ కాలంలో శరీరాన్ని విడిచి వెళ్లినప్పుడు పునర్జన్మ లేని గతిని పొందుతారో, ఏ కాలంలో వెళ్లినప్పుడు తిరిగి వస్తారో.. ఆ కాలాన్ని నేను నీకు చెప్తాను శ్లోకం 24

అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః  అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం అయిన ఆరు నెలలు ఈ మార్గంలో శరీరాన్ని విడిచిన బ్రహ్మవేత్తలు బ్రహ్మను చేరుకుంటారు. వీరికి పునర్జన్మ లేని పరమగతి శ్లోకం 25  ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే ధూమం, రాత్రి, కృష్ణపక్షం, దక్షిణానయం అయిన ఆరు నెలలు - ఈ మార్గంలో వెళ్లిన యోగి చంద్రలోకం చేరి , పుణ్యఫలాలు అనుభవించి తిరిగి వస్తాడు శ్లోకం 26 శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతేఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః ఈ శుక్ల, కృష్ణ మార్గాలు జగత్తులో శాశ్వతమైనవిగా పరిగణిస్తారు. శుక్లగతి ద్వారా వెళ్లినవారు తిరిగిరారు..మరో మార్గంద్వారా వెళ్లిన వారు తిరిగి భూమ్మీద పుడతారు అయితే జ్ఞానులు, అనన్య భక్తులకు ఈ కాలాలు అడ్డురావు.. ఎప్పుడు మరణించినా ఉత్తమ లోకాలు చేరుకుంటారు ఆచార్యుల వివరణ

కంచి పరమాచార్యులు వివరించినట్టు..ఇది కేవలం క్యాలెండర్ లో ఆరు నెలల కాలం మాత్రమే కాదు.. ఆత్మ ప్రయాణంలో ఉత్తరాయణ అధిష్టాన దేవతలు లేదా దక్షిణాయనంలో అధిష్టాన దేవతలు మార్గనిర్ధేశం చేస్తాయి. అంటే మరణ సమయం కన్నా ఆత్మ స్థితి, కర్మ, జ్ఞానం, భక్తి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి

ధర్మాత్ముడు దక్షిణానయంలో మరణించినా..ఉత్తరాయణ దేవతలు తనని ఉత్తమ మార్గంలో తీసుకెళ్తారు

పాపాత్ముడు ఉత్తరాయణంలో మరణించినా..తన కర్మ ప్రకారమే గతి నిర్ణయమవుతుంది

భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉత్తరాయణం కోసం ఎదురుచూశారు.. ఆయనకు ఇచ్ఛామరణం అనే వరం ఉంది ( అంటే కోరుకున్నప్పుడు Pమృత్యు దేవత సమీపిస్తుంది). 

యజ్యాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః....అని భగవద్గీతలో చెప్పినట్టు..శ్రేష్ఠులు అనుసరించిన మార్గాన్ని లోకం అనుసరిస్తుంది. ధర్మం, జ్ఞానం, వైరాగ్యం ఆదర్శాన్ని చూపించేందుకు , ధర్మరాజుకి రాజధర్మం ఉపదేశించేందుకు, పుణ్యలోకాలపై గౌరవం చూపించేందుకు భీష్ముడు ఉత్తరాయణం వచ్చేవరకూ వేచి ఉన్నాడు.  ధర్మాచరణ, నిష్కామ కర్మ, భగవంతుడి స్మరణ..ఇవే ఉత్తమ గతిని కల్పిస్తాయి.  ధర్మంగా జీవించండి

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు