Pradosh Vrat 2025: ప్రతి సంవత్సరం దోషాల నుంచి విముక్తి పొందడానికి 24 ప్రదోష వ్రతాలు చేస్తారు. సమీపంలో ప్రదోష వ్రతం ఎప్పుడంటే ఆగష్టు 20, సెప్టెంబర్ 5న వచ్చాయి  

ప్రదోష వ్రతం  అంటే శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహాదేవుడి అనుగ్రహం కోసం ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే త్రయోదశి రోజు ప్రదోష కాలంలో శివలింగానికి అభిషేకం చేస్తారు. ప్రదోష సమయంలో ఆచరించే వ్రతం కావున ఇది ప్రదోష వ్రతం అయింది.  

ప్రదోష వ్రతం ఎందుకు చేస్తారు?

ప్రదోష వ్రతం చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం , మాధుర్యం కొనసాగుతాయి. సోమ ప్రదోష వ్రతం ఆచరించేవారికి మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.  

2025 ఆగష్టు 20న ప్రదోష వ్రతం  బుధ ప్రదోష వ్రతం - శ్రావణ మాసంలో అమావాస్య ముందు త్రయోదశి ఆగష్టు 20 బుధవారం వచ్చింది. వాస్తవానికి ఆగష్టు 20 బుధవారం సూర్యోదయ సమయానికి ద్వాదశి తిథి ఉంది. మధ్యాహ్నం 2 గంటల 20 నిముషాలకు త్రయోదశి ఘడియలు ప్రారంభమయ్యాయి. తిరిగి ఆగష్టు 21 గురువారం మధ్యాహ్నం 12 గంటల 54 నిముషాలకు త్రయోదశి ఘడియలు ముగుస్తున్నాయి. అంటే సాయంత్రం సమయానికి త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆగష్టు 20న ప్రదోష వ్రతం ఆచరించాలి.  

2025 సెప్టెంబరు 05 ప్రదోష వ్రతం

భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు త్రయోదశి సెప్టెంబరు 05 శుక్రవారం వచ్చింది. ఈ రోజు త్రయోదశి సూర్యోదయం నుంచి అర్థరాత్రి వరకూ ఉంది. ఎలాంటి సందేహాలు లేకుండా ప్రదోష వ్రతం సెప్టెంబరు 05న ఆచరించవచ్చు

పూజా సమయం - సాయంత్రం 6.38 to రాత్రి 8.55

ప్రదోష వ్రత పూజా విధానం (Pradosh Vrat Vidhi)

ఉదయాన్నే నిద్ర లేచి స్నానమాచరించి తెల్లటి వస్త్రాలు ధరించాలి.

భోళా శంకరుడిని పూజించాలి. పూజలో బిల్వపత్రాలు, గంగాజలం, అక్షతలు, పూలు వినియోగించండి

ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో శివునికి శాస్త్రోక్తంగా పూజ చేయాలి

“ఓం నమః శివాయ” మంత్రాన్ని జపించాలి.

ప్రదోష వ్రత కథ చదవి పరమేశ్వరుడికి హారతి ఇవ్వాలి

ప్రదోష సమయంలో శివుడు నందీశ్వరుడితో కలిసి భక్తుల కోరికలు తీర్చేందుకు భూలోకానికి తరలి వస్తాడని భక్తుల విశ్వాసం. వివిధ రకాల ప్రదోష వ్రతాలున్నాయి. వాటిలో సోమ ప్రదోష వ్రతం, శని ప్రదోష వ్రతం ఇలా. ప్రతి ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది  

ప్రదోష వ్రత కథ 

పూర్వం ఒక నగరంలో ఓ స్త్రీ..భర్త మరణం తర్వాత పిల్లలకోసం కష్టపడి పనిచేస్తూ వారిని తల్లి తండ్రీ అన్నీ తానై జీవిన సాగించేది. ఆమె శివభక్తురాలు.  ప్రతి ప్రదోషానికి ఉపవాసం ఉండి, పరమేశ్వరుడిని పూజించేది. ఒక రోజు ఆమెకు ఒక గాయపడిన యువకుడు కనిపించాడు. తనని ఇంటికి తీసుకొచ్చి కోలుకునేవరకూ సేవలు చేసింది. ఆ యువకుడు విదర్భ రాజ్యానికి చెందిన యువరాజు అని, శత్రువుల దాడి నుంచి తప్పించుకుని వచ్చాడని ఆమెకు తెలుస్తుంది. తండ్రిని కూడా శత్రువులు బంధించారని తెలుసుకుంటుంది. అప్పుడు ఆ యువరాజుకి అండగా నిలిచి తండ్రిని విడిపించేందుకు శివుడి అనుగ్రహంతో సహాయం చేసింది. అప్పటి నుంచి ఆమె దారిద్ర్యం, కష్టాలు తొలగిపోయాయి. మరణానంతరం శివసాయుజ్యం పొందింది. ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం