Avoid Buying These 4 Things On Sunday: ఆదివారం కొన్ని వస్తువులు కొనకూడదు. శాస్త్రాల ప్రకారం, ఇలా చేస్తే కుండలిలో సూర్యుడు బలహీనపడి ఆరోగ్యం, ధనం, ప్రతిష్టలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతారు.
ప్రతి శనివారం కొన్ని వస్తువులు కొనుగులుచేయడాన్ని పెద్దలు నిషేధిస్తారు. అలాగే ఆదివారం రోజు కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి, దీని వల్ల దారిద్ర్యం ఇంట్లో పాతుకుపోతుందని చెబుతారు.
ఆదివారం రోజు ఏం కొనకూడదంటే?
ఆదివారం రోజు ఇంటి నిర్మాణ వస్తువులు, గార్డెనింగ్ సామాగ్రి కొనుగోలు చేయడం మంచిది కాదు..దీనివల్ల సూర్యుడి అనుగ్రహం కోల్పోతారని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆర్థికంగా నష్టోతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజు ఇనుము వస్తువులు కూడా కొనకూడదు. సాధారణంగా శనివారం రోజు ఇనుము వస్తువులు కొనుగోలు చేయొద్దు..శనిదేవుడికి చిహ్నం అంటారు. కానీ శనిదేవుడి తండ్రి సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం రోజు కూడా ఇనుము కొనుగోలు చేయకూడదు అంటారు. ఆదివారం రోజు ఇనుము కొనుగోలు చేస్తే మీ గౌరవం తగ్గుతుంది సెలవు రోజు కదా అని ఆదివారం రోజు ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు కొందరు. కానీ ఇది శుభప్రదం కాదు.ఆదివారం రోజు ఫర్నిచర్ కొనుగోలు చేస్తే ఇంట్లో పేదరికం పెరుగుతుంది..లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అంటారు. సాధారణంగా ఏ వస్తువులైనా శుక్రవారం రోజు కొనుగోలు చేయడం శుభప్రదం
ఆదివారం రోజు హార్డ్‌వేర్, వాహన సంబంధిత వస్తువులు కూడా కొనుగోలు చేయడం సరికాదు. ఇవి కూడా ఇనుముకి సంబంధించినవే . ఇలా చేస్తే ధననష్టం జరుగుతుందని చెబుతారు.
ఆదివారం మరి ఏం కొంటే మంచిదంటే
కంటికి సంబంధించిన వస్తువులు ఆదివారం కొనుగోలు చేస్తే మంచిది. ఈ రోజు కళ్ల రక్షణ సూర్యభగవానుడి అనుగ్రహంతో సాధ్యమవుతుంది. ఇంకా గోధుమల , రాగి కొనుగోలు చేయొచ్చు. ఆదివారం రోజు గోధుమలు, రాగి, కళ్లజోడు కొనుగోలు చేయడం మంచిది. ఇంకా ఈ రోజు ఎరుపురంగు వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదం. పర్సులు, హ్యాండ్ బ్యాగులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
నవగ్రహ స్తోత్రం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥
రవిఃజపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥
చంద్రఃదధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం ।నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥
కుజఃధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥
బుధఃప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥
గురుఃదేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥
శుక్రఃహిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥
శనిఃనీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥
రాహుఃఅర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥
కేతుఃపలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥
ఫలశ్రుతిఃఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥
గమనిక: వివిధ శాస్త్రాలు, ఆధ్యాత్మిక పండితులు పేర్కొన్న వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని పరిగణలోకి తీసుకునేందుకు మీరు సంపూర్ణంగా నమ్మే పండితుల సలహాలు కూడా స్వీకరించండి. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి