అన్వేషించండి

Apara Ekadashi 2026: ఈ రోజు అపర ఏకాదశి - సాయంత్రం ఈ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే అద్భుతాలు జరుగుతాయి!

Jyeshtha Ekadashi Vrat 2026: జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలోని 11వ రోజు అయిన మే 13వ తేదీన అపరా ఏకాదశి వ్రతం పాటిస్తున్నారు. ఈ రోజును పవిత్రంగా చేసుకోవడానికి సాయంత్రం ఈ ప్రదేశాలలో దీపాలు వెలిగించండి.

Ekadashi Vrat 2026: అపరా ఏకాదశి హిందూ మతంలోని ప్రత్యేక ఏకాదశి తేదీలలో ఒకటి. ఇది జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి రోజున వస్తుంది. అపరా ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా పిలుస్తారు. అపరా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల జీవితంలో అపారమైన ఆనందం , శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.

పంచాంగం ప్రకారం 2026 మే 13న అపర ఏకాదశి పాటిస్తున్నారు.  ఏకాదశి తిథి మే 12 మంగళవారం ఉదయం ప్రారంభమైంది.. మే 13 బుధవారం మధ్యాహ్నం లోపు ముగుస్తోంది. అయినప్పటికీ  సూర్యోదయ తిథి ప్రకారం మే 13 బుధవారమే అపరా ఏకాదశి వ్రతం పాటిస్తారు. ఏప్రిల్ 14వ తేదీన వ్రతం విరమిస్తారు. జైపూర్-జోధ్‌పూర్‌లోని పాల్ బాలాజీ జ్యోతిష్య సంస్థ డైరెక్టర్, ప్రఖ్యాత జ్యోతిష్కుడైన డాక్టర్ అనీష్ వ్యాస్ ప్రకారం , అపరా ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, ఉపవాసం ఉండటం, విష్ణువును ప్రార్థించడం,  దానధర్మాలు చేయడం పుణ్యకార్యాలుగా పరిగణిస్తారు. ఈ ఏకాదశి నాడు సూర్యాస్తమయం తర్వాత నిర్దిష్ట ప్రదేశాలలో దీపాలు వెలిగించడం లక్ష్మీదేవి ఆశీస్సులను తెస్తుంది. అపరా ఏకాదశిని శుభప్రదంగా మార్చడానికి, సాయంత్రం కాగానే ఈ ప్రదేశాలలో తప్పకుండా దీపాలు వెలిగించండి. ఇది మీ ఇంటికి , కుటుంబానికి అదృష్టాన్ని సానుకూలతను తెస్తుంది.

లక్ష్మీ నారాయణ ప్రార్థన

అపరా ఏకాదశి రోజు సాయంకాల ప్రార్థనల సమయంలో, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ప్రదోష కాలంలో వెలిగించిన ఈ దీపం మీ జీవితంలోకి ఆనందాన్ని తీసుకురాగలదు.

ప్రధాన ద్వారం 

ఏకాదశి రోజున సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఆవరణలో దీపం వెలిగించండి. ఇది ప్రతికూల శక్తిని తొలగించి, ఇంటికి శుభాన్ని చేకూరుస్తుంది.

తులసి దగ్గర 

ఏకాదశి రోజు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీరు దీన్ని క్రమం తప్పకుండా కూడా చేయవచ్చు. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది.

నది లేదా సరస్సు 

ఏకాదశి సాయంత్రం, పవిత్రమైన నది లేదా సరస్సు దగ్గర దీపం వెలిగించాలి. సమీపంలో నది లేదా సరస్సు లేకపోతే, బావి దగ్గర లేదా ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగించవచ్చు. ఇది పితృదేవతల ఆశీర్వాదాలను అందించి, మోక్షానికి దారి తీస్తుంది.

దీపం వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది?

పూజ సమయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించడం ఆశీస్సులను తెస్తుంది.  

అపరా ఏకాదశి వ్రతం ఆచరిస్తే బ్రహ్మహత్య, అబద్ధ సాక్ష్యం, గురు నింద లాంటి పాపాలు తొలగిపోతాయని విష్ణు పురాణం చెబుతోంది. ఈ రోజు గంగాస్నానం, కాశీ యాత్ర, గోదానం చేస్తే అత్యంత పుణ్యఫలం. ఏకాదశి రోజు భక్తితో చేసే ఉపవాసం, విష్ణుధ్యానం ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి. భవబంధనాల నుంచివిముక్తి కలిగించేందుకు ఏకాదశి ఉపవాసం శ్రేష్ఠమైనదిగా భావిస్తారు భక్తులు.  

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Muharram 2026 Date: మొహర్రం ఎప్పుడు? జూన్ 16 లేదా 17 ఎప్పుడు జరుపుకుంటారు?
మొహర్రం ఎప్పుడు? జూన్ 16 లేదా 17 ఎప్పుడు జరుపుకుంటారు?
సైన్స్ vs ఆధ్యాత్మికత : మంచోళ్లు త్వరగా చనిపోవడం వెనుక అసలు రహస్యం!
సైన్స్ vs ఆధ్యాత్మికత : మంచోళ్లు త్వరగా చనిపోవడం వెనుక అసలు రహస్యం!
Ashta Praharalu: రోజుకి 8 జాములు! ఏ జాములో ఏం చేయాలి, ఏం చేయకూడదు? అష్ట ప్రహారాలు రహస్యం తెలుసుకోండి!
రోజుకి 8 జాములు! ఏ జాములో ఏం చేయాలి, ఏం చేయకూడదు? అష్ట ప్రహారాలు రహస్యం తెలుసుకోండి!
Today Rashifal June 12th: ఈ రోజు రాశి ఫలాలు జూన్ 12, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు జూన్ 12, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Crime Thriller Series OTT : డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Meenakshi Natarajan Court Case: మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
Kadiri Shadi Mahal Dispute: కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
Embed widget