Akshaya Tritiya 2025
శ్లోకం
శుక్లామ్భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం,ప్రసన్న వదనం ద్యాయే త్సర్వ విఘ్నొపశాన్తయే.
ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయక పూజ చేస్తారు.ఆచమనీయం, ప్రాణాయామం, సంకల్పం, కలశపూజ పూర్తిచేసిన తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠాపనఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునఃప్రాణమిహనో ధేహిభోగమ్,జ్యోక్పశ్యేమ సార్య ముచ్చరన్త మనుమతే మృడ్యానస్స్వస్తి,అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యధాస్ధాన ముపహ్వయతే, స్వామి నిస్సర్వ జగన్నాధే యావత్పూజావసానకం తావత్వ్తం ప్రీతిభావేన(బింబే అస్మిన్) సన్నిధింకురు, స్ధిరాభవ,వరదాభవ, సుముఖీభవ, సుప్రసన్నాభవ, స్ధిరాసనంకురు. అక్షతలు అమ్మవారిపై ఉంచండి
ధ్యానంజగన్నాతర్మహాదేవి మహాత్రిపురసుందరి,సుధాచైతన్య మూర్తిం తేకల్పమామి నమశ్శివే, మహాపద్మవనాంతఃస్ధే కారణానందవిగ్రహే, సర్వభూతహితే మాతరేహ్యేహి పరమేశ్వరి, ఏహ్యేహి దేవదేవేశిత్రిపురే దేవపూహితే, పరామృతప్రియే శీఘ్రం సాన్నిద్ధ్యం కురుసిద్ధిదే. శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి.
ఆవాహనంహిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతఃస్రజాం చంద్రాం హిరణ్మఈం లక్ష్మీం జాతవేదొ మమావహ.శ్లో. ఆగచ్చదేవి వరదే దైత్యదర్ప నిషూదిని.పూజాం గృహాణ సుముఖి నమస్తే శంకరప్రియే. శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ఆవహయామి.
ఆసనంతాం ఆవహాజాతవేదో లక్ష్మీ, మనపగామినీమ్, యస్యాం హిరణ్యంవిందేయం గామశ్వం పురుషానహమ్.శ్లో. అధాహం బైందవేచక్రే సర్వానంద మయాత్మకే,రత్నసింహాసనే రమ్యే సమాసీనాం శివప్రియామ్. శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః రత్నసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి
పాద్యంఅశ్వపూర్వాం రధమధ్యాం హస్తినాద ప్రబోధనీమ్,శియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్.శ్లో. సువాసితజలం రమ్యం సర్వతీర్ధ సముద్భవం,పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః పాద్యం సమర్పయామి
అర్ఝ్యంకాంసోస్మితాం హిరణ్యప్రాకారా ఆర్ద్రాం జ్వలన్తీం తృప్తాంతర్పయన్తీమ్పద్మేస్ధితాం పద్మవర్ణాం త్వామిహోపహ్వయేశ్రితమ్.శ్లో.శుద్ధోదకం చ పాత్రస్ధం గంధపుష్పాది మిశ్రితమ్,అర్ఝ్యం దాస్యామితే దేవి గృహాణ సురపూజితే శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః అర్ఝ్యం సమర్పయామి
స్నానంఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతిస్తన వృక్షోధబిల్వః తస్యఫలాని తపసానుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యాలక్షీః స్నానార్థంతే మయానీతం గౌతమీ సలిలం శుభం, అనేన సలిలే నద్య స్నానంకురు మహామతే... శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
ఆచమనీయంచన్ద్రాం ప్రభాసాం యశసాజ్వలన్తీం శ్రియంలోకే దేవ జుష్టాముదారామ్, తాంపద్మినీ మీం శరణ మహం ప్రపద్యే లక్ష్మిర్మేనశ్యతాం త్వాంవృణేశ్లో.సువర్ణ కలశానీతం చన్దనాగరు సంయుతం, గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి
వస్త్రంఉపైతుమాం దేవ సఖఃకీర్తిశ్చ మణినాసహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి మృద్ధిం దదాతుమేశ్లొ.దుకూలం స్వీకురు ష్వేదం స్వర్ణబిందు సమాయుతమ్,ఉత్తరీయం కంచుకంచ తధావిధమతంద్రితే శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః కంచుకసహిత వస్త్రంసమర్పయామి
యజ్ఞోపవీతంక్షుత్పిపాసామలాం జ్యేష్ఠమ లక్ష్మిం ఆశయామ్యహమ్,అభూతిమసమృద్ధించ సర్వాం నిర్ణుదమే గృహాత్శ్లొ. తప్తహేమ కృతం దేవి గృహాణత్వం శుభప్రదేఉపవీత మిదం దేవీ గృహాణత్వం శుభప్రదే శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంధంగంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్ఠాం కరీషిణీమ్. ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియమ్.శ్లో.శ్రీగంధం చందనోన్మిశ్రం కుంకుమాగరు సంయుతంకర్పూరేణ్ చ సంయుక్తం విలేపయ సురేశ్వరి శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః శ్రీగంధం సమర్పయామి
ఆభరణం మనసః కామమాకూతిం వాచస్సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్స మయిశ్రీ శ్శ్రయతాం యశః.శ్లో. కేయూర కఙ్కణేదివ్యే హారనూపుర మేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే ఆభరణాని సమర్పయామి. శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ఆభరణం సమర్పయామి ( మీరు బంగారం కొంటే అది అమ్మవారికి సమర్పించండి)
అక్షతాన్కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ, శ్రియంవాసయ మేకులేమాతరం పద్మమాలినీమ్.శ్లో.త్వత్పాదపద్మాయుగళే ప్రణతం క్షేమగాయనమ్ప్రతి గృహ్యాక్షతాన్ దేవి దేహి మహ్యం మహావరమ్ శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః కుంకుమపుష్పాక్షతాన్ సమర్పయామి.
శ్లో.కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహైఃజాజి చంపకమాలతీ వకుళకైః మందార కుందాదిభిఃకేతక్యాకర వీరకైః బహువిధైః క్ఙప్తాస్స్రజోమాలికాఃసంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతామ్ శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః పుష్పమాలా ధారయామి
...... లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, కనకధార స్తోత్రం చదువుకోవాలి..... అనంతరం దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి ఆప్రస్స్రజన్తు స్నిగ్ధానిచిక్లీత వసమేగృహేనిచదేవీం మాతరం శ్రియం వాసయమేకులే శ్లో.వనస్పతిరసైర్దివైర్గంధాద్యైః సుమనోహరైః,కపిలాఝృత సంయుక్తో ధాపోయం ప్రతి గృహ్యతాం శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ధూపమాఝ్రాపయామి నైవేద్యంఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీమ్సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.శ్లో. శర్కరామధుసంయుక్త మాజ్యా ధైరధపూరితమ్, శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి.
నైవేద్యం కోసం ఉంచిన పదార్థాలపై నీళ్లు చిలకరిస్తూ ఓం ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, వ్యానాయస్వాహా, ఉదానాయస్వాహా, సమానాయస్వాహా ...అమృతాపిధానమసి, ఉత్తరాపోషనం సమర్పయామి, హసౌప్రక్షాళయామి,పాదౌప్రక్షాళయామి, శుద్దాచమనీయం సమర్పయామి. అని అయిదు పర్యాయములు పుష్పముతోనుదకమునుంచవలయును.
తాంబూలంతాంమ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్స్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్ విన్దేయం పురుషానహమ్శ్లో.పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దశైర్యుతం,కర్పూరచూర్ణ సం యుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః తామ్బూలం సమర్పయామి
నీరాజనం హిరణ్యపాత్రంమధోః పూర్భం దధాతిమధవ్యోసానీతి ఏకధాబ్రహ్మణ్ ఉపహరతి, ఏకధైవయజమాన ఆయుస్తేజో దధాతిసామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం పారమేష్ట్యగం రాజ్యం మహారాజ్యం మాధిపత్యం శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః కర్పూర నీరాజనం దర్శయామి మంత్రపుష్పం
శ్లో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాథికే,శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణ నమస్కారం యానికానిచ పాపాని జన్నాంతర కృతానిచ,తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదేపాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలఅన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమతస్మాత్ కారుణ్య భావేన మహాలక్షీ రక్షమాం సదా. శ్రీమహాలక్షి దేవికి నమస్కరించాలి
క్షమాపణ
శ్లో.మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరితత్సర్వం క్షమ్యతాందేవి కాత్యాయని నమోశ్తుతే.
అనయామయాకృత పూజయా భగవతీ సర్వాత్మికాః మహాకాళి,మహాలక్షి,మహాసరస్వతి సుప్రీతా సుప్ర్సన్నా వరదాభవన్తు అని చెబుతూ అక్షతలు నీళ్లు విడిచిపెట్టాలి.