Parabhava Nama Samvatsara Ugadi 2026: మార్చి 19 ఉగాది. ఈ రోజు తప్పనిసరిగా ఆచరించాల్సిన 5 విధులు ఇవే..
1. తైలాభ్యంగనం - నువ్వుల నూనె రాసుకుని స్నానం ఆచరించడం
2. నూతన సంవత్సరాది స్తోత్రం - నూతన సంవత్సర ప్రారంభ శ్లోకం
3. నింబకుసుమ భక్షణం - ఉగాది పచ్చడి తినడం
4. ధ్వజారోహణం - పూర్ణకుంభదానం
5. పంచాంగ శ్రవణం - పంచాంగం వినడం
ఈ ‘పంచకృత్య నిర్వహణ’ చేయాలని సూచించింది ధర్మసింధు తైలాభ్యంగనం
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనె రాసుకుని తలంటు పోసుకోవడం. ఉగాది వంటి శుభదినాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం కన్నా ముందే స్నానం ఆచరించాలి. “అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం” అభ్యంగన స్నానం సర్వ అవయవాల పుష్టిదాయకం అని ఆయుర్వేదోక్తి.. అభ్యంగన స్నానం ఆరోగ్యం కూడా నూతన సంవత్సర స్తోత్రం
అభ్యంగ స్నానం తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం మామిడి ఆకుల తోరణాలతో, పూల తోరణాలతో దేవుడి మందిరంలో మంటపాన్ని అలంకరించి నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతను పూజించి ప్రసాదాన్ని నివేదించాలి ఉగాది పచ్చడి సేవనం
ఉగాది పండుగలో పచ్చడి తీసుకోవడం అత్యంత ప్రధానమైనది. వేప పువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు.. వీటితో పాటూ చెరకు, పుట్నాల పప్పు కూడా మిక్స్ చేస్తారు కొందరు. అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్
ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అంతా సేవించాలి. ఉగాది రోజు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరం మొత్తం సౌఖ్యంగా ఉంటుందని ఈ శ్లోకం భావం. పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా.సంతోషానికి పొంగిపోవద్దు, దుంఖానికి కుంగిపోవద్దు అనే సత్యాన్ని చాటుతూ..జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనం అని వివరిస్తుంది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి సేవిస్తే అనారోగ్యం తగ్గుతుందని, ఆరోగ్యంంగా ఉంటారని చెబుతారు పండితులు
పూర్ణ కుంభదానం
ఉగాది రోజు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపనను అనుసరిస్తారు. ఓ పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకంలా కట్టి దానిపై కొబ్బరికాయతో ఉన్న కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడి ఆకులు, పత్రాలు, పూలు, వేపఆకులు కట్టి ఇంటి ప్రాంగణంలో పెట్టి పూజిస్తారు. ఈ ఆచారాన్ని అనుసరించేవారి సంఖ్య ఇప్పుడు తగ్గింది..ఆ స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం, మట్టితో చేసిన కొత్త కుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పుష్పాలు, అక్షతలు వేసి పూజించి కలశానికి ఓ నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బొండాం ఉంచి పూజించి పండితులకు దానం ఇవ్వాలి. పూర్ణకుంభం దానం ఇస్తే ఏడాదంతా భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పంచాంగ శ్రవణం తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం...వీటినే పంచాంగాలు అంటారు. ఇవన్నీ కలసి ఉండేవే పంచాంగం. ఉగాది రోజు ఆలయంలో గ్రామ కూడలి ప్రదేశాల్లో, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయ ఫలాలు తెలుసుకుని ఏడాది పొడవునా ఎలా ఉండాలో ముందుగానే తెలుసుకోవడం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నానం చేసేంత ఫలితం లభిస్తుందని విశ్వాసం
ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసేవారికి..
సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్నికుజుడు శుభాన్నిశని ఐశ్వర్యాన్నిరాహువు బాహుబలాన్నికేతువు కులాధిక్యతను కలిగిస్తారని నమ్మకం.. ‘బ్రహ్మ ప్రళయం’ పూరైన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతి కల్పంలో వచ్చే యుగాదిని ఉగాది అంటారు.
ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు చదవాల్సిన శ్లోకం శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచసర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
