జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో సుమారు 25 ఏళ్ల తర్వాత సోమశిల వద్ద చారిత్రక సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఏళ్ల తరబడి నీటిలోనే మునిగి ఉన్న ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలు ఇప్పుడు పూర్తిగా దర్శనమిస్తుండటంతో స్థానికులు, పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చి తిలకిస్తున్నారు.