ఓ పాడుబడిన బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన చిరుతపులిని అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా, సాహసోపేతంగా కాపాడారు. సురక్షితంగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి ఆ చిరుతను మళ్లీ అడవిలోకి వదలడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.