సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ కోసం కొందరు యువకులు చేస్తున్న విపరీత పోకడలు శృతిమించుతున్నాయి. తాజాగా ఓ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఏకంగా పెట్రోల్ తాగేశాడు. ఈ ప్రమాదకరమైన విన్యాసం నెట్టింట తీవ్ర కలకలం రేపింది. నెటిజన్లు అతడి మూర్ఖపు చర్యపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.