భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.