జూబ్లిహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో ఈ ఉదయం ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ..PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. మాధాపూర్ వైపు నుంచి సీఎం ఇంటివద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డగించారు. కొంతమంది గుంపుగా నినాదాలు చేసుకుంటూ.. ముఖ్యమంత్రి ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.