ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో సరికొత్త రికార్డు నమోదైంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ వేలంలో బాలాపూర్ లడ్డు రూ. 39 లక్షల భారీ ధరకు అమ్ముడైంది. ఈ ప్రతిష్టాత్మక లడ్డును సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధర మరో 4 లక్షలు పెరగడం విశేషం.