తెలంగాణలో ఎంతో పేరుగాంచిన ప్రఖ్యాత బాలాపూర్ గణేష్ శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తుల జై శ్రీరామ్, గణపతి బప్పా మోరియా నినాదాల నడుమ గణనాథుడి ఊరేగింపు మొదలైంది. ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్న ఈ శోభాయాత్రను తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.