ఒకప్పుడు మైదానంలో విరాట్ కోహ్లీ యాటిట్యూడే వేరు. సాధారణంగా సచిన్ లాంటి క్రికెటర్లు తమని ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే వారికి నోటితో కాకుండా బ్యాట్‌తో సమాధానం చెప్తారు. కానీ కోహ్లీ మాత్రం మైదానంలో ప్రత్యర్థులు రియాక్ట్ అయితే అక్కడికక్కడే ఇచ్చి పడేసుడే ఉండేది. తర్వాత బ్యాట్ బాదుడు కూడా ఉండేది అనుకోండి అది వేరే ముచ్చట. కానీ 2019-21 బ్యాడ్ ఫేజ్ తర్వాత కోహ్లీలో కాస్త మార్పు వచ్చింది. అగ్రెసివ్నెస్ కాస్త తగ్గించాడు. కానీ బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ పాత కోహ్లీ సరదాగా ఒక్కసారి అలా వచ్చి వెళ్లాడు.